Anushka : ఆ స్టార్ డైరెక్టర్ కొడుకుతో అనుష్క పెళ్లి ఎప్పుడో ఫిక్స్ అయింది .. కానీ మధ్యలో ప్రభాస్ వచ్చి ఆపేశాడు ..?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anushka : ఆ స్టార్ డైరెక్టర్ కొడుకుతో అనుష్క పెళ్లి ఎప్పుడో ఫిక్స్ అయింది .. కానీ మధ్యలో ప్రభాస్ వచ్చి ఆపేశాడు ..??

 Authored By aruna | The Telugu News | Updated on :12 July 2023,1:00 pm

Anushka  : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. నాగార్జున నటించిన ‘ సూపర్ ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క ల జోడీకి విపరీతమైన క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అది పక్కా బ్లాక్ బస్టర్ అయినట్లే. ఇప్పటికే ప్రభాస్ అనుష్క కలిసి మిర్చి, బిల్లా, బాహుబలి సినిమాలు చేశారు. ఇవన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయినవే. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని రూమర్స్ క్రియేట్ చేశారు.

అయితే వీటన్నింటిని కొట్టి పడేస్తూ ప్రభాస్, అనుష్క మేమిద్దరం కేవలం స్నేహితులం మాత్రమే అని చాలాసార్లు చెప్పుకొచ్చారు. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. కానీ అనుష్క మాత్రం సినిమాల పరంగా కాస్త డల్ అయినట్లు కనిపిస్తోంది. సంవత్సరానికి ఒక్క సినిమా కూడా చేస్తున్నట్లు లేదు. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టితో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక అనుష్క మాత్రం 40 ఏళ్లు పైబడుతున్న ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.

Prabhas cancel the Anushka marriage

Prabhas cancel the Anushka marriage

అయితే గతంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు అనుష్కను తమ ఇంటి కోడలు చేసుకోవాలని ప్రయత్నించాడట. ఆయన కొడుకు కోవులమూడి ప్రకాష్ కు అనుష్కను ఇచ్చి పెళ్లి చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారట. అయితే 2014లో ప్రకాష్ ముంబాయి కు చెందిన కనికా థిల్లాల్ ను పెళ్లి చేసుకోగా కొన్నాళ్ళకి వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అయితే రాఘవేంద్రరావు తన కొడుకుకి మళ్ళీ పెళ్లి చేయాలని తమ ఇంటి కోడలు అనుష్క రావాలని కోరుకున్నారు కానీ అనుష్క ఇంట్రెస్ట్ లేదని చెప్పిందట. దీంతో కొందరు ప్రభాస్ అంటే అనుష్కకి ఇష్టమని అందుకే ఆ పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసుకుందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది