Prabhas : బాహుబలి సినిమాతో తిరుగులేని రీతిలో హీరో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. ఈ సినిమాతో బాలీవుడ్‌లో ఎవరికీ సాధ్యం కాని మార్కెట్ ప్రభాస్ సొంతమైంది. ఈ కారణంగానే ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలే తీస్తున్నాడు. అయితే బాహుబలి తర్వాత సాహో లాంటి యాక్షన్ సినిమా హిట్ కాకపోయినా బాలీవుడ్‌లో చెప్పుకోదగ్గ రీతిలోనే వసూళ్ల వర్షం కురిపించింది.తాజాగా ప్రభాస్ నటించిన సినిమా రాధే శ్యామ్.. అయితే ఈ సినిమ కూడా సక్సెస్ సాధించలేక పోయింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ ఫ్యాన్స్ కు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా లేవని అంతా పెదవి విరిచారు.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో ఇలా చేయించడం
ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదని అంటున్నారు.రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా మిశ్రమ స్పందన రావడంతో కలెక్షన్స్ కూడా పడి పోయాయి. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఈ సినిమా చుసిన వాళ్ళు విజువల్ వండర్ అంటూ పొగిడేసారు కానీ సినిమా బాగుంది అని మాత్రం అనలేదు.. జ్యోతిష్యం నేపథ్యంలో వచ్చిన రాధేశ్యామ్ పై ప్రశంసల కంటే కూడా ఎక్కువగా విమర్శలే వినిపించాయి..ఈ సినిమా రిజల్ట్ పై ప్రభాస్ ఎలా స్పందిస్తారో అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో తాజాగా ఈయన రాధేశ్యామ్ సినిమాపై నోరు విప్పారు.. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధేశ్యామ్ ప్లాప్ కావడానికి కారణం ఏంటో చెప్పుకొచ్చాడు.. ప్రపంచ వ్యాప్తంగా సౌత్ సినిమాలు సందడి చేస్తున్న క్రమంలో ఈయన కూడా ఓపెన్ అయ్యారు.
టెలివిజన్ స్క్రీన్ పై చూసి రాధేశ్యామ్ ను ఇష్టపడతారని ఆశిస్తున్నాను.. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు టెలివిజన్, ఓటిటి ప్లాప్ ఫామ్ లలో సినిమాలు చూస్తున్నారు.. అందుకే ఫ్యామిలీ అంత కలిసి కూర్చుని సినిమాను ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను..ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టలేక పోవడానికి కరోనా లేదా స్క్రిప్ట్ లో ఏదైనా మిస్ అయి ఉండవచ్చు.. లేదా ఆ జోనర్ లో ప్రేక్షకులు నన్ను చూడాలని అనుకోక పోవచ్చు.. అన్ని సినిమాలకు బాహుబలి లాంటి రెస్పాన్స్ రావాలనే ఒత్తిడి నా డైరెక్టర్స్, నిర్మాతలపై ఉంది.. కానీ నాపై మాత్రం లేదు.. ఆ సినిమా రావడం నా అదృష్టంగా భావిస్తాను.. విభిన్నమైన పాత్రల్లో, మంచి కంటెంట్ తో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించాలని అనుకుంటున్నాను” అంటూ తెలిపాడు..
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.