Home » Entertainment » Prabhas Danimate With Bollywood Heroes
Entertainment

Prabhas : ఇప్పటికీ బాలీవుడ్ హీరోలతో సహా ఎవరూ డానిమేట్ చేయలేకపోయారు ..

Authored By
vamana sai
The Telugu News | Published on: May 23, 2022, 2:30 pm
Advertisement

Prabhas : సౌత్ సినిమా ఇండస్ట్రీలో భారీ కటౌట్ ఉన్న ఏకైక హీరో ప్రభాస్ మాత్రమే. 5 అడుగులున్న హీరోయిన్ పౌర్ణమి సినిమాలో ప్రభాస్ ముందు నిలుచొని ‘మీ హైట్ ఎంత’.. అని అడిగితే ‘ఆరు చిల్లర’.. అని ఫన్నీగా సమాధానం చెప్తాడు. అలాంటి కటౌట్ పాన్ ఇండియన్ సినిమాలకు పనికొస్తుందని గుర్తించిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. బాహుబలి లాంటి సిరీస్‌తో మన తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించాలని రాజమౌళి అనుకొని దానికి ఒక్క ప్రభాస్ మాత్రమే కరెక్ట్ డిసైడయి బాహుబలి సిరీస్ తీశారు.

Advertisement

ఆ తర్వాతే మన సౌత్ సినిమా ఇండస్ట్రీలలో పాన్ ఇండియన్ సినిమా అనేది చేయొచ్చునని ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వందల, వేల కోట్లను కొల్లగొట్టవచ్చునని అందరికీ తెలిసింది. అది ప్రభాస్ – రాజమౌళి వల్లే సాధ్యమవడం ఇక్కడ ఆసక్తికరమైన విషయం. అయితే, ప్రభాస్ తర్వాత దాదాపు అందరు హీరోలు పాన్ ఇండియన్ సినిమాలను చేస్తున్నారు. ఆయన రేంజ్‌ను దాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, అది అంత ఈజీగా రీచ్ అయ్యే విషయం కాదని ఈ పాటికే అర్థం అయి ఉండొచ్చు.

Prabhas Danimate with Bollywood Heroes

Advertisement

Prabhas : ఈ స్టామినా మన ప్రభాస్ ఒక్కడికే ఉండటం విశేషం.

బాహుబలి సిరీస్ తర్వాత సాహో, రాధే శ్యామ్మ్ సినిమాలొచాయి. ఈ నాలుగు చిత్రాలతో దాదాపు రూ 3000 కోట్లను బాకాఫీస్ వద్ద రాబట్టాడు ప్రభాస్. కానీ, ఆ తర్వాత వచ్చిన పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ సిరీస్ కలిసి రూ 2700 కోట్ల వరకు లాక్కొచ్చారు. అంటే రేస్‌లో ఎలా చూసుకున్న ప్రభాసే టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక ఈ రేంజ్ మార్కెట్ బాలీవుడ్ స్టార్స్ అయిన ఖాన్‌ల త్రయం సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమీర్ ఖాన్‌లకు మాత్రమే ఉంది. అయితే, టాలీవుడ్‌లో ఈ స్టామినా మన ప్రభాస్ ఒక్కడికే ఉండటం విశేషం.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి