Prabhas : నీవల్లే కేజిఎఫ్ సినిమా మిస్ అయ్యాను .. రాజమౌళి పై సీరియస్ అయిన ప్రభాస్...!
Prabhas Salaar Movie : ప్రశాంత్ నీల్, ప్రభాస్ Prabhas కాంబినేషన్లో వస్తున్నసలార్ సినిమా Salaar Movie కోసం ఫ్యాన్స్ అంత ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 22న విడుదల కాబోతుంది. అయితే తాజాగా సలార్ టీంను రాజమౌళి SS Rajamouli ఇంటర్వ్యూ చేశారు. ఇక అన్ని భాషల వారికి అర్థమయ్యేలా ఇంగ్లీషులో ఇంటర్వ్యూ చేశారు. సలార్ క్రేజ్ చూస్తే ఏమనిపిస్తుంది అని ప్రశాంత్ ను రాజమౌళి అడిగారు. దీనికి కాస్త టెన్షన్ గా ఉంది. నేను ఇప్పటివరకు నాలుగు సినిమాలు తీశాను. కానీ ఏ సినిమాలో ఇంత డ్రామా ట్రై చేయలేదు. అందుకే కొంచెం టెన్షన్ పడుతున్నాను అని అన్నారు. ప్రభాస్ అలా నిలిచి ఉంటే చాలు అతనికి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు అని రాజమౌళి అన్నారు.
ఈ సినిమా చూసేందుకు ఆడియన్స్ ఎందుకు రావాలి అన్న ప్రశ్నకు ఆన్సర్ ఇస్తూ ..దేవ, వరదరాజ మన్నార్ ల ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరూ ఎలా విరోధులుగా మారారు అన్నదే సలార్ కథ. ఈ సినిమాలో ఎక్కువగా డ్రామా ఉంటుందని ప్రశాంత్ తెలిపారు. ప్రధాన పాత్రల మధ్య డ్రామా బాగా వర్కౌట్ అయిందని తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని అన్నారు. ఇక ఈ సినిమా కెజిఎఫ్ కు సంబంధం ఉంటుందా అంటే అలా యూనివర్సల్ లా చేయడంతోనే వాళ్ళు కాదని కే జి ఎఫ్ లో రాఖీని ఎలా ఇష్టపడ్డారో, సలార్ లో దేవ, వరదరాజలను కూడా ఇష్టపడతారని ప్రశాంత్ నీల్ అన్నారు. శృతిహాసన్ రెండు సాంగ్స్ నాకు చాలా ఇష్టం. ఒకటి రేసుగుర్రం ఇంకొకటి చారుశీల సాంగ్. అలాంటిది సలార్లో ఆమెతో ఎలాంటి డ్యూయెట్ లేదా ప్రభాస్ తో కలిసి ఒక్క సాంగ్ కూడా పెట్టలేదు నేను అప్సెట్ అయ్యానని రాజమౌళి సరదాగా అన్నారు.
దానికి ప్రశాంత్ ఆన్సర్ ఇస్తూ సినిమాలో శృతిహాసన్ కూడా కథలో భాగమని అన్నారు. వరల్డ్ సినిమా తన పంథా మార్చుకుంది. అందుకే ఈ సినిమా లో డ్యూయెట్ లేదని అన్నారు. సలార్ సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. దానిని మీరు ఎలా తీసుకున్నారు అని రాజమౌళి అడగ్గా..అందుకే సోషల్ మీడియాకు తన గుడ్ బై చెప్పానని, 1000 మంది మెచ్చుకొని ఒక్కరు విమర్శించిన అది హర్ట్ చేస్తుంది. అందుకే సినిమా అయ్యేవరకు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాను అని అన్నారు.
డార్లింగ్ ఎక్స్పెక్టేషన్స్ ప్రెజర్ ని ఎలా డీల్ చేసావ్ అని ప్రభాస్ ని అడిగారు రాజమౌళి . దానికి ఆన్సర్ ఇస్తూ ప్రశాంత్ నీల్ తో సినిమా చర్చలు ఎలా మొదలైంది ఎలా కుదిరింది అన్నదానికి వివరణ ఇచ్చారు ప్రభాస్. క్యాజువల్ గా మీట్ అయ్యాం అది కూడా వేరే నిర్మాత వల్ల. ఆ తర్వాత హోమ్ బలే ప్రొడక్షన్స్ ప్రశాంత్ నీల్ తో సినిమా అనగానే డేట్స్ అడ్జస్ట్ చేసి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యానని అన్నారు. ప్రశాంత్ నీల్ ఆఫర్ ని కాదంటే ఫ్యాన్స్ ఊరుకోరని సినిమా చేశానని ప్రభాస్ అన్నారు. అంతేకాదు కేజిఎఫ్ తర్వాత అందరూ ప్రశాంత్ నీల్ తో చేయాలని అనుకున్నారు అతను నాతో చేయాలని అనుకోవడం ఇదంతా బాహుబలి వల్లే అని రాజమౌళిని పొగిడారు. కేజిఎఫ్ ప్రభాస్ చేసి ఉంటే బాగుండేది అని చాలామంది అన్నారు. కొంతమంది పొలిటిషియన్స్ కూడా నాతో అన్నారు. కేజీయఫ్ మీరు చేసి ఉంటే బాగుండేది అని, అందుకే ప్రశాంత్ సినిమా అనగానే డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోయినా నాగ్ అశ్విన్ కి సర్ది చెబుదామని సలార్ కి ఓకే చెప్పాను అని ప్రభాస్ అన్నారు.
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
Gym : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
This website uses cookies.