Prabhas Marriage : ఫ్యాన్స్ కి గుడ్‌న్యూస్.. ప్రభాస్ జీవితంలోకి ప్రత్యేకమైన వ్యక్తి.. ఏంటి పెళ్లి కొడుకు కాబోతున్నాడా..!
Prabhas Marriage : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వయస్సు దాదాపు 44 ఏళ్లు. ఆయన ఇంకా పెళ్లి చేసుకోలేదు.పెళ్లి చేసుకునేది పక్కన పెడితే వరుస సినిమాలతో తెగ సందడి చేస్తున్నాడు. ప్రభాస్ పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం కల్కి 2898 ఏడీ . సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టాప్ బ్యానర్ వైజయంతీ మూవీస్ తెరకెక్కిస్తోంది. మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తు్న్నాడు. పాపులర్ మ్యూజిక్ లేబుల్ సరిగమసౌత్‌తో మ్యూజికల్ జర్నీ షురూ చేస్తుందని మేకర్స్ ఓ ట్యూన్ షేర్ చేశారు. జూన్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇక ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ చిత్రంతో పాటు పలు చిత్రాలు చేస్తున్నాడు.
ఇవన్నీ పక్కన పెడితే ప్రభాస్‌కి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.ప్రభాస్ ఇన్‌స్టాలో ఒక కొత్త స్టోరీ పెట్టాడు. అందులో “డార్లింగ్స్.. చివరిగా నా జీవితంలోకి అత్యంత స్పెషల్ పర్సన్ రాబోతున్నారు. వెయిట్ చేయండి” అని స్మైలింగ్ ఎమోజీతో రాసుకొచ్చాడు ప్రభాస్. ఈ స్టోరీ క్షణంలో వైరల్ అయింది. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రభాస్ ఏ హీరోయిన్‌తో మూవీ చేస్తే వారితో లవ్ ఎఫైర్ టాపిక్ వచ్చేది. అందరికంటే ఎక్కువ ప్రభాస్-అనుష్క పెళ్లి టాపిక్ వైరల్ అయింది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన బిల్లా, బాహుబలి సినిమాలు డార్లింగ్ అభిమానులకే కాదు ఆడియెన్స్‌కు సైతం ఎంతో నచ్చాయి.
Prabhas Marriage : ఫ్యాన్స్ కి గుడ్‌న్యూస్.. ప్రభాస్ జీవితంలోకి ప్రత్యేకమైన వ్యక్తి.. ఏంటి పెళ్లి కొడుకు కాబోతున్నాడా..!
ప్రభాస్ అకౌంట్ హ్యాక్ అయిందని కొందరు అంటుంటే, మరి కొందరు తన సినిమాకి సంబంధించిన అప్‌డేట్ ఇస్తారని అంటున్నారు. కల్కి ప్రమోషన్స్ కోసమే ఇలా చేస్తున్నారని మరికొందరు, ఇంకా ప్రభాస్ పెళ్లి కోసం అయితే కాదు కదా అంటూ ఇలా అనేక రకాలుగా ఈ పోస్ట్ ఇప్పుడు కన్ఫ్యూజన్ గా మారిపోయి ఫ్యాన్స్ ని గందరగోళం లోకి నెట్టేసింది. దీనితో ఒక్కసారిగా ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మరి ప్రభాస్ పెట్టిన పోస్ట్ వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తానే రివీల్ చేసేవరకు ఆగక తప్పదు మరి.
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
This website uses cookies.