
Prabhas : పెళ్లి వార్త చెబుతాడనుకుంటే ఆ వార్త చెప్పి అందరిని బకరాలు చేసిన ప్రభాస్
Prabhas : మే 17న ప్రభాస్ తన ఇన్‌స్టా స్టోరీ పోస్ట్‌గా త్వరలోనే మన జీవితంలోకి ఓ ప్రత్యేకమైన వాళ్లు వస్తున్నారు.. వెయిట్ చేయండి అని అన్నాడు. దీంతో ఇది అతని పెళ్లి గురించే అయి ఉంటుందని ఫుల్ ఖుష్ అయ్యారు. తీరా అది కల్కి 2898 ఏడీ మూవీ ప్రమోషన్ల కోసమే అని తర్వాత తేలింది. ఇప్పుడు బుజ్జి అంటూ ప్రభాసే ఆ పోస్ట్ పై ఓ క్లారిటీ ఇచ్చాడు. మే 18 సాయంత్రం 5 గంటలకు స్క్రాచ్ ఎపిసోడ్ 04రిలీజ్ కానున్నట్లు వెల్లడించాడు. ఆ పోస్ట్ లోనే కింద.. “డార్లింగ్స్.. నా బుజ్జిని మీరు చూడాలని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను” అని అతడు రాయడం విశేషం. కల్కి చిత్రీకరణకు నాగ్ అశ్విన్ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన వాహనాలని చూపించబోతున్నాడు.
ఆ వస్తువులు ఎన్నడూ చూడని విధంగా ఉంటాయట. కల్కి మూవీలో వాడే వాహనాలకు టెక్నాలజీ విషయంలో సహాయం అందించాలని పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను నాగ్ అశ్విన్ అడిగారు. అయితే కల్కి మూవీలో ప్రభాస్ పాత్ర పేరు భైరవ కాగా, ఆయన ఓ ప్రత్యేక వాహనం వాడుతారట. దాని పేరు బుజ్జి కాగా… దాన్ని ప్రేక్షకులకులు పరిచయం చేయనున్నారట. ఈ మేరకు అప్డేట్ ఇచ్చారు. మే 18 సాయంత్రం 5:00 గంటలకు భైరవకు చెందిన బుజ్జిని పరిచయం చేస్తామని యూనిట్ సభ్యులు తెలియజేశారు. కల్కి చిత్రంతో ప్రేక్షకులను నాగ్ అశ్విన్ ఫ్యూచర్ లోకి తీసుకెళ్లనున్నారు. ఈ చిత్రంలో వాహనాలు కూడా భవిష్యత్ పరిస్థితులను అంచనా వేసి డిజైన్ చేసినట్లు సమాచారం.
Prabhas : పెళ్లి వార్త చెబుతాడనుకుంటే ఆ వార్త చెప్పి అందరిని బకరాలు చేసిన ప్రభాస్
కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. రూ.600 కోట్ల భారీ బడ్జెట్ మూవీ కోసం దేశవ్యాప్తంగా జోరుగా ప్రమోషన్లు నిర్వహించనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ తోపాటు దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలాంటి వాళ్లు నటిస్తున్నారు. అయితే ప్రభాస్ పెళ్లి అంటూ అందరు ఎన్నో ఆలోచనలు చేయగా, అదంతా నిరాశే అయింది. చూస్తుంటే ప్రభాస్ ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా లేడుగా. 44 ఏళ్ల వయస్సు ఉన్న ప్రభాస్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ మాదిరిగా సింగిల్‌గా ఉండిపోతాడా ఏంటి అని నెటిజన్స్ ముచ్చటించుకుంటున్నారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.