Prabhas : సినిమా పరిశ్రమలో ఒకసారి ఎత్తు పల్లాలు రావడం సహజం. ఒకసారి ఉన్నత స్థాయికి వెళ్లిన హీరో సడెన్‌గా చతికిల పడుతుంటాడు. మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కూడా వాటిని ప్రేక్షకులు రిసీవ్ చేసుకోరు. దీంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంటుంది. ప్రభాస్ లాంటి స్టార్ హీరోకి వరుస ఫ్లాపులు రాగా, ఆయన పరిస్థితి చూసి యష్ భయపడుతున్నాడట. అందుకు కారణం ఏంటి, ప్రభాస్ సమస్యలు చూసి యష్ ఎందుకు ఆందోళన చెందుతున్నాడు వంటివి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. మీకు ఇంకా ఇలాంటి ఇంటరెస్టింగ్ వీడియోలు కావాలంటే మా చానెల్ ను ఫాలో అవ్వండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఒకప్పుడు కన్నడలో అద్భుతమైన సినిమాలు చేసినా కూడా కేజీఎఫ్ చిత్రంతో అతనికి పాపులారిటీ దక్కింది. కన్నడ సీరియల్ హీరో గా నటనా జీవితం మొదలుపెట్టి ఆ తర్వాత సినిమా పరిశ్రమలో హీరోగా అడుగుపెట్టి కేజీఎఫ్ వంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.
హీరో యష్.కే జి ఎఫ్ సినిమాకి ముందు కేవలం 3 నుంచి 4 కోట్ల పారితోషకం తీసుకునే యష్ ఆ తర్వాత 50 కోట్లకు పైగా పారితోషికం తీసుకునే హీరోగా ఎదిగాడు. సినీ అవకాశాల కోసం తాను కేవలం మూడు వందల రూపాయలతో బెంగళూరులో అడుగుపెట్టాడు. కర్ణాటకలోని హసన్ జిల్లాలో పుట్టిన యశ్ ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు. తండ్రి బస్ డ్రైవర్, తల్లి గృహిణి. కాగా యశ్ సినిమాల్లోకి వెల్లేందుకు వారి కుటుంబం అంగీకరించలేదు. కానీ వారు యష్ కోసం సినిమాల్లో ప్రయత్నించేందుకు తనకు కొంత సమయం మాత్రం ఇచ్చారు. ఆ సమయంలోపు అవకాశాలు దక్కించుకుంటే సరి. లేదంటే తాము చెప్పిన పనిలో చేరాలని సూచించారు. దీనికి అంగీకరించిన యశ్ తన తండ్రి నుంచి తీసుకున్న మూడు వందల రూపాయలతో బెంగళూరు చేరుకున్నాడు. మెల్లమెల్లగా యశ్ సీరియల్స్‌లో నటిస్తున్నప్పుడే తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత కన్నడ చిత్రాలలో చిన్న చిన్న సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చేశాడు. చివరకు 2008లో ‘రాకీ’ చిత్రంతో హీరోగా మారాడు.
ఆ తర్వాత వచ్చిన వరుస హిట్‌లతో యశ్ కన్నడనాట స్టార్ హీరోగా ఎదిగాడు. ‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఇక ఇటీవలే విడుదలైన ‘కేజీఎఫ్-2’తో బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా పాన్ ఇండియా స్టార్‌గా యష్ అవతరించాడు. ‘కేజీ ఎఫ్ 2’ మ్యానియాతో యష్ ఇమేజ్ ఒకేసారి తారా స్థాయికి చేరిపోయింది. ఒక కన్నడ హీరో పాన్ ఇండియా హీరోగా మారిపోవడంతో అతడి వద్దకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అయితే ఈ ఆఫర్లను పట్టించుకోకుండా యష్ తన భార్యా పిల్లలతో ప్రస్తుతం యూరప్ లో ఉన్నాడు. సాధారణంగా హీరోలు ఒకసినిమా బ్లాక్ బష్టర్ హిట్ అయినతరువాత తన దగ్గరకు వచ్చే నిర్మాతల నుండి అడ్వాన్స్ లు తీసుకుని ఆతరువాత కథల గురించి ఆలోచనలు చేస్తారు. అయితే యష్ ప్రస్తుతం దీనికి భిన్నంగా వ్యవహరిస్తూ తన దగ్గరకు వచ్చి కథలు చెపుతామని ప్రయత్నిస్తున్న ఏ దర్శకుడుకి అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదట. దీనితో యష్ ఇప్పట్లో మరొక సినిమాను చేసే ఉద్దేశ్యంలో లేదా అంటూ ఊహాగానాలు మొదలైపోయాయి.
కన్నడ మీడియా వ్రాస్తున్న ఊహాగానాల ప్రకారం యష్ ఇలా ప్రవర్తించడానికి ఒక కారణం ఉంది అని అంటున్నారు. అంతేకాదు యష్ కు ప్రభాస్ సమస్యలు వెంటాడుతున్నాయని టాక్. ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ ‘సాహో’ లాంటి భారీ యాక్షన్ మూవీలో నటించినప్పటికీ జనానికి నచ్చలేదు. దీనితో లవ్ స్టోరీ వైపుకు వెళ్ళి ‘రాథే శ్యామ్’ లో నటించాడు. ఆసినిమా ఫ్లాప్. ప్రభాస్ నుండి వచ్చే ప్రతి సినిమా ‘బాహుబలి’ లా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఇప్పుడు యష్ పరిస్థితి కూడ అలాగే ఉంది అంటున్నారు.‘కేజీ ఎఫ్ 2’ తరువాత యష్ లవ్ స్టోరీలో నటించాల లేదంటే యాక్షన్ మూవీలో నటించాలా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. యష్ నుండి రాబోయే సినిమా ‘కేజీ ఎఫ్ 2’ మించిన స్థాయిలో ఉండాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ‘కేజీ ఎఫ్ 2’ దర్శకుడు ప్రస్తుతం ఖాళీగా లేడు. ఎవరో ఒక దర్శకుడితో సినిమా చేయాలి. మరి అతడు ఎవరిని ఎంచుకుంటాడు, సినిమా అప్‌డేట్ ఎప్పుడు ఇస్తాడు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.