Home » Entertainment » Prabhas Project K Movie Update 2
Entertainment

Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కి మరొక బిగ్ బ్యాడ్ న్యూస్ ?

Authored By
aruna
The Telugu News | Updated on: July 3, 2023 1:08 pm
Advertisement

Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ఇటీవల ‘ ఆదిపురుష్ ‘ సినిమాతో శ్రీరాముడిగా నటించి ప్రేక్షకులను అలరించారు. ఇక త్వరలోనే ‘ ప్రాజెక్ట్ కె ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, బాలీవుడ్ స్టార్స్ అమితాబచ్చన్, దీపికా పదుకొనే కీలకపాత్రలు పోషిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే 70% షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా గ్రాఫిక్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం.

Advertisement

అయితే ఈ సినిమాలో పురాణాలకు సంబంధించిన పాత్రలను ఎలివేట్ చేసి వాటికి అనుగుణంగా కథను తీర్చిదిద్దారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే గతంలో అమితాబచ్చన్ పాత్రను అశ్వద్ధామ స్ఫూర్తితో తీర్చిదిద్దారని అన్నారు. ఇప్పుడు తాజాగా ప్రభాస్ పాత్ర గురించి ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ విష్ణువు అవతారంలో కనిపించనున్నారట. అంటే విష్ణు పాత్ర స్ఫూర్తితో తీర్చిదిద్దారన్నమాట. దీంతో ప్రభాస్ విష్ణువుగా కనిపిస్తున్నాడంటే అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. ఇది నిజమో కాదు తెలియదు కానీ వార్త మాత్రం జోరుగా ప్రచారం జరుగుతుంది.

Prabhas

Advertisement

మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రానున్నా ఈ సినిమాలో ఐదు సుదీర్ఘమైన యాక్షన్ బ్లాకులు ఉన్నట్లు సమాచారం. వీటిని రూపొందించడానికి హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లను రంగంలోకి దించారట. ఎన్నడు చూడని విధంగా భారీ విజువల్ మూవీగా అతిపెద్ద యాక్షన్ థ్రిల్లర్గా వస్తుందని దర్శక నిర్మాతలు అంటున్నారు. దాదాపుగా 500 కోట్లు బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. అత్యున్నత స్థాయిలో విఎఫ్ఎక్స్ హంగులను తీర్చిదిద్దుతున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా పాజిటివ్ టాక్ను సంపాదించుకుంటుందో లేదో చూడాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి