Salaar Movie Collections : మూడో రోజు కుమ్మేసిన సలార్ కలెక్షన్స్.. ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ ..!!? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Salaar Movie Collections : మూడో రోజు కుమ్మేసిన సలార్ కలెక్షన్స్.. ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ ..!!?

 Authored By anusha | The Telugu News | Updated on :25 December 2023,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Salaar Movie Collections : మూడో రోజు కుమ్మేసిన సలార్ కలెక్షన్స్.. ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ ..!!?

Salaar Movie Collections : ప్రభాస్ ఎట్టకేలకు సలార్  సినిమా తో హిట్టు కొట్టాడు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా డిసెంబర్ 22న ఐదు భాషలలో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే 178.7 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 2023లో హైయెస్ట్ ఓపెనింగ్ డే గ్రాసర్గా ఈ సినిమా ఉంది. లియో సినిమా రికార్డు బ్రేక్ చేసి మొదటి స్థానంలో నిలిచింది. రెండో రోజుకు సలార్ వసూళ్లు తగ్గాయి. అయితే మూడో రోజుకు పుంజుకుంది. ఆదివారం నుంచి వసూళ్లు బాగా వస్తున్నాయి. సలార్ మూవీ వరల్డ్ వైడ్ మూడు రోజులకు 402 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే సలార్ భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇంకా చాలా దూరంలో ఉంది. ఈరోజు క్రిస్మస్ సెలవు దినం కాగా సలార్ సినిమాకి కలిసొచ్చే అంశం. న్యూ ఇయర్ వరకు జనాలు పండగ మూడ్ లో ఉంటారు.

ఈ సమయంలో సలార్ వసూళ్లు నిలకడగా ఉంటే బ్రేక్ ఈవెన్ అంత కష్టం కాదు. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో సలార్ వసూలు సాలిడ్ గా ఉన్నాయి. ఇక సలార్ ఫైనల్ ఫిగర్స్ ఎలా ఉంటాయో చూడాలి. ప్రభాస్ కటౌట్ కి తగ్గ సినిమా కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి లో ఉన్నారు. ఈ సినిమాకి ప్రశాంత నీల్ దర్శకత్వం వహించారు. కేజిఎఫ్ డైరక్టర్ తో ప్రభాస్ చేసిన మూవీ కావడంతో మరింత హైప్ పెరిగింది. అభిమానుల నమ్మకం నిలబడుతూ సలార్ మూవీలో ప్రభాస్ మాస్ అప్పీయరెన్స్ అందరిని ఆకట్టుకుంది. ప్రభాస్ కటౌట్ కి తగ్గట్టుగా మాస్ యాక్షన్ సన్నివేశాలను ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రశాంత్ సక్సెస్ అయ్యారు. రెండు భాగాలుగా విడుదల కానున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ నటించింది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ జగపతిబాబు, బాబీ సింహ, ఈశ్వరి రావు కీలక పాత్రలు చేశారు.

ఇక ప్రభాస్ పాన్ ఇండియా హీరో అవ్వడంతో ఆయన ప్రతి సినిమాపై మరింత హైప్ పెరుగుతుంది. ఇక గత సినిమాలు నిరాశ పరచడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రభాస్ సలార్ సినిమాతో సాలిడ్ అందుకున్నాడు. పాన్ ఇండియా ఇమేజ్ కి తగ్గ సినిమా పడడంతో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రభాస్ ఈజ్ బ్యాక్ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సాలిడ్ హిట్ అందుకుంది. ఇక రెండో భాగం కూడా అదే రేంజ్ లో సక్సెస్ అవుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేజిఎఫ్ తరహా లోనే రెండు పార్ట్ లుగా ఈ సినిమా తెరకెక్కుతుంది. దానిలాగే ఇది కూడా హిట్గా నిలుస్తుందని అంటున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

Also read

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది