
Salaar Movie Public Talk : సలార్ మూవీ పబ్లిక్ టాక్ .. డైనోసర్ ఆరాచకం.. ప్రభాస్ మాస్ ర్యాంపేజ్..!
Salaar Movie Public Talk : ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సలార్ సినిమా ఈరోజు విడుదలైంది. ప్రభాస్ గత సినిమాలు నిరాశపరచడంతో సలార్ సినిమాపై అభిమానులు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. రెండు పార్టులుగా రూపొందిన సలార్ సినిమాను కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. అయితే సలార్ మొదటి షో చూసిన ప్రేక్షకులు సినిమా సూపర్ హిట్ గా ఉందని, ప్రభాస్ యాక్టింగ్ అద్భుతంగా ఉందని, ప్రభాస్ కటౌట్ తగ్గ సినిమా అని, ప్రభాస్ – పృద్విరాజ్ మధ్య ఫ్రెండ్షిప్ బాగా చూపించారని, యాక్షన్ సీన్స్ లో ప్రభాస్ అదరగొట్టేసాడని, క్లైమాక్స్ అద్భుతంగా ఉందని సినిమా చూసిన పబ్లిక్ చెప్తున్నారు. మొత్తానికి అయితే ఈ సినిమా ప్రభాస్ ఇమేజ్ను నిలబెట్టింది.
ఇక ఈ సినిమా కథ 1995లో అస్సాంలో పిల్లల స్నేహాన్ని చూపిస్తూ స్టార్ట్ అవుతుంది. తర్వాత అక్కడే ఓ బొగ్గు గనిలో దేవా పనిచేస్తుంటాడు. అదే ప్రాంతంలో ఆధ్యా(శృతి హాసన్) ఒక టీచర్ గా పనిచేస్తుంది. తనను కొందరు రౌడీలు కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా దేవా( ప్రభాస్) తనను కాపాడుతాడు. అదే సమయంలో దేవా ఫ్రెండ్ వరదరాజు మన్నార్( పృథ్వీరాజ్ మన్నార్) దేవాను వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు. మరోవైపు ఇండియాకు సరిహద్దుగా ఉన్న ఓ ప్రాంతంలో ఖాన్సార్ అనే అటవీ ప్రాంతం ఉంటుందిష తర్వాత కాలంలో అది ఒక రాజ్యంగా మారుతుంది. ఖాన్సార్ రాజ్యాన్ని మన్నార్ వంశానికి చెందిన వాళ్లు పాలిస్తూ ఉంటారు. అయితే అక్కడ యుద్ధం చేయకూడదని ఉన్న ఒప్పందాన్ని తుంగలో తొక్కే ప్రయత్నాలు జరుగుతుంటాయి.
ఆ ప్రాంతాన్ని పాలించే వరదరాజు తండ్రి రాజమన్నార్( జగపతిబాబు) రాజ్యాన్ని వదిలేసి వెళ్తాడు. అయితే దేవాను వెతుక్కుంటూ ఒక రాజ్యాధిపతి ఎందుకు వచ్చాడు అనేది ఇక్కడ పెద్ద ట్విస్ట్. అందుకే దేవ వరదరాజు బాల్యానికి సంబంధించి ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నడుస్తుంది. నిజానికి వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ తోనే సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కట్ చేస్తే అస్సాంలో బొగ్గు గనిలో పనిచేస్తూ కనిపిస్తాడు. అండర్ గాడ్ గా దేవా ఉంటాడు. అయితే అండర్ గాడ్ గా దేవాను చూపించడం ఒకవైపు అయితే మరోవైపు అసలు క్యారెక్టర్ చూపిస్తారు. అసలు దేవ ఎవరు, అతని గతం ఏంటి, అనేది ఫస్ట్ హాఫ్ లోనే చూపిస్తాడు డైరెక్టర్. ఆ తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో మొత్తం ఖాన్సార్ రాజ్యం గురించి చూపిస్తారు. ఖాన్సార్ రాజ్యంలో రాజమన్నార్ అధినేతగా ఉంటాడు. ఆయన కొందరు సామంత రాజులను నియమించడంతో కథ మొత్తం యూటర్న్ తీసుకుంటుంది.
ఈ సామంత రాజులు కుట్రలు చేయడంతో అసలు కథ మొదలవుతుంది. ఒకసారి రాజమన్నార్ బయటికి వెళ్లడంతో సామంత రాజులు కుట్రలు చేస్తుంటారు. అది కన్సార్ పీఠం కోసం చేసే కుట్రలు. అప్పుడే దేవా వచ్చి ఖాన్సార్ ఎలా సామంతుల చేతుల్లోకి వెళ్ళకుండా కాపాడుతాడు అనేది అసలు స్టోరీ. తన ఫ్రెండ్ కోసం దేవా శత్రువులందరినీ అడ్డు తొలగిస్తాడు. ఖాన్సార్ రాజ్యాన్ని రాజమన్నార్ కి అప్పగిస్తాడు. అయితే రాజ్యం కోసం మన్నార్ తనని వాడుకున్నాడని దేవా తెలుసుకుంటాడు. ఇక్కడే పెద్ద ట్విస్ట్ మొదలవుతుంది. తర్వాత తన ఫ్రెండ్ కి ఎలా బుద్ధి చెప్పాడు. ఖాన్సార్ రాజ్యాన్ని దేవా మళ్లీ ఎలా సొంతం చేసుకుంటారు అనేది స్టోరీ. మోసం చేసిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది మిగిలిన స్టోరీ.
Garlic | చలికాలం వచ్చేసింది అంటే చలి, దగ్గు, జలుబు, అలసటలతో చాలా మందికి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమయంలో…
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
This website uses cookies.