Salaar : సలార్ కోసం ఎదురుచూస్తోన్న ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే బ్రేకింగ్ న్యూస్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Salaar : సలార్ కోసం ఎదురుచూస్తోన్న ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే బ్రేకింగ్ న్యూస్ !

Salaar : ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే నాలుగు ఐదు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. కేజిఎఫ్ సినిమా తర్వాత అంతకుమించి అనే విధంగా సలార్ సినిమాని ప్రశాంత్ నీల్ ఆవిష్కరిస్తూ ఉండడం విశేషం. ఈ సినిమాలో ప్రభాస్ కంప్లీట్ నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరో పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే జగపతిబాబు, పృధ్విరాజ్, […]

 Authored By prabhas | The Telugu News | Updated on :23 April 2023,1:00 pm

Salaar : ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే నాలుగు ఐదు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. కేజిఎఫ్ సినిమా తర్వాత అంతకుమించి అనే విధంగా సలార్ సినిమాని ప్రశాంత్ నీల్ ఆవిష్కరిస్తూ ఉండడం విశేషం. ఈ సినిమాలో ప్రభాస్ కంప్లీట్ నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరో పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే జగపతిబాబు, పృధ్విరాజ్, సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది.

prabhas salaar movie update

prabhas-salaar-movie-update

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన లుక్స్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి. ఈ సినిమా ఖచ్చితంగా ప్రభాస్ కెరియర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్స్ పూర్తి చేసే పనిలో నిర్మాత ఉన్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ మొదలైంది. ఈ మూవీ షూటింగ్ 2021లో మొదలు అయింది. ఆ తర్వాత ఎక్కువ గ్యాప్స్ తీసుకోవడంతో పాటుగా ప్రభాస్ మల్టిపుల్ ప్రాజెక్టులను టేకప్ చేయడంతో ఈ సినిమాతో పాటు

ఆ సినిమాలో కూడా వర్క్ చేయడంతో సినిమా లేట్ అవుతూ వచ్చింది. ఫైనల్ గా ఈ సినిమాను మే నెలలో పూర్తి చేయనున్నారు. ఫైనల్ గా ఈ సినిమా మే నెలకి పూర్తిచేసి సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నారు. అయితే ఫైనల్ షెడ్యూల్లో సలార్ 2 కి సంబంధించిన మరో రెండు సీన్స్ కూడా షూట్ చేయనున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. సలార్ పార్ట్ వన్ క్లైమాక్స్ లో సీక్వెల్ ఎలివేషన్ కోసం రెండు సీక్వెన్స్ ని టీజర్ రూపంలో ప్రశాంత్ చూపియాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్ టార్గెట్ తో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది