
Good news for those who are looking for Prabhas Salaar
Salaar : ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే నాలుగు ఐదు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. కేజిఎఫ్ సినిమా తర్వాత అంతకుమించి అనే విధంగా సలార్ సినిమాని ప్రశాంత్ నీల్ ఆవిష్కరిస్తూ ఉండడం విశేషం. ఈ సినిమాలో ప్రభాస్ కంప్లీట్ నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరో పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే జగపతిబాబు, పృధ్విరాజ్, సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది.
prabhas-salaar-movie-update
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన లుక్స్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి. ఈ సినిమా ఖచ్చితంగా ప్రభాస్ కెరియర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్స్ పూర్తి చేసే పనిలో నిర్మాత ఉన్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ మొదలైంది. ఈ మూవీ షూటింగ్ 2021లో మొదలు అయింది. ఆ తర్వాత ఎక్కువ గ్యాప్స్ తీసుకోవడంతో పాటుగా ప్రభాస్ మల్టిపుల్ ప్రాజెక్టులను టేకప్ చేయడంతో ఈ సినిమాతో పాటు
ఆ సినిమాలో కూడా వర్క్ చేయడంతో సినిమా లేట్ అవుతూ వచ్చింది. ఫైనల్ గా ఈ సినిమాను మే నెలలో పూర్తి చేయనున్నారు. ఫైనల్ గా ఈ సినిమా మే నెలకి పూర్తిచేసి సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నారు. అయితే ఫైనల్ షెడ్యూల్లో సలార్ 2 కి సంబంధించిన మరో రెండు సీన్స్ కూడా షూట్ చేయనున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. సలార్ పార్ట్ వన్ క్లైమాక్స్ లో సీక్వెల్ ఎలివేషన్ కోసం రెండు సీక్వెన్స్ ని టీజర్ రూపంలో ప్రశాంత్ చూపియాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్ టార్గెట్ తో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.