Akhil Agent movie pre release event Prabhas
Prabhas : అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్ త్వరలోనే ‘ ఏజెంట్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భారీ యాక్షన్ గా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 28వ తారీఖున విడుదల అవ్వబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. దీనికి ఫ్యాన్స్ ఆడియోస్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నిన్ననే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యూఏ సర్టిఫికెట్ ను అందుకుంది. చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన యాక్షన్ ఎంటర్టైనర్ ని చూసాము అంటూ సెన్సార్ సభ్యులు మూవీ టీం నీ పొగడ్తలతో ముంచెత్తారు.
Akhil Agent movie pre release event Prabhas
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాబోతున్నాడని సోషల్ మీడియాలో గత రెండు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వస్తున్నాడంటూ ప్రచారం జరిగింది. కానీ అవన్నీ రూమర్స్ అని ఈరోజు తేలింది. ఏజెంట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు తెలంగాణలోని వరంగల్ ప్రాంతంలో జరగనుంది. అయితే ఈ ఈవెంట్ కి గెస్ట్ గా అఖిల్ తండ్రి అక్కినేని నాగార్జున హాజరు కాబోతున్నాడట. దీంతో ఇన్ని రోజులు ప్రభాస్ వస్తాడు అనుకుంటే చివరికి ఇలా అయింది ఏంటి అని ప్రభాస్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
నిజానికి ప్రభాస్ కోసం ఈ సినిమా టీం మొత్తం ప్రయత్నం చేసిన విషయం నిజమే. కానీ ప్రభాస్ ప్రాజెక్ట్ కె సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వలన చివరి నిమిషంలో రాలేను అని చెప్పేసాడు. దీంతో చాలా రోజుల తర్వాత ప్రభాస్ ని ఒక పబ్లిక్ ఫంక్షన్ లో చూడొచ్చని ఆనందపడిన అభిమానులకి నిరాశే మిగిలింది. ఇక ఏజెంట్ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ హైదరాబాదులో త్వరలోనే ప్రారంభం కానున్నాయి. మరీ అఖిల్ ఈ సినిమాతో సూపర్ హిట్ లో కొడతాడో లేదో చూడాలి.
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
This website uses cookies.