Prabhas Salaar Part 1 Ceasefire Official trailer : ప్రభాస్ సలార్ ట్రైలర్ వచ్చేసింది.. ట్రైలర్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే.. ప్రభాస్‌కు హిట్ పడినట్టే

Authored By Breaking News 2 | The Telugu News | Updated on: December 1, 2023, 7:42 pm
  •  దూసుకుపోతున్న ప్రభాస్ సలార్ ట్రైలర్

  •  విడుదలైన కొన్ని క్షణాల్లోనే లక్షల వ్యూస్ సొంతం

  •  యూట్యూబ్ లో రికార్డులు బద్దలు కొడుతున్న సలార్ ట్రైలర్

Prabhas Salaar Part 1 Ceasefire Official trailer : రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. చాలా రోజుల నుంచి ఈ ట్రైలర్ కోసం అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. ఇక వెయిట్ ఈజ్ ఓవర్.. మూవీ ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ విడుదలై కొన్ని నిమిషాలు కూడా కాలేదు అప్పుడే మిలియన్ల వ్యూస్ వచ్చాయి అంటే ఈ మూవీ మీద ప్రేక్షకులకు ఎన్ని అంచనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ విడుదలకు ఇంకా 20 రోజుల సమయం ఉంది. తాజాగా ఆ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్.

అసలే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న మూవీ కావడం, బాహుబలి స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో హీరో కావడంతో ఈ సినిమాకు ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. వీళ్ల కాంబోలో మూవీ దద్దరిల్లిపోవాల్సిందే అని ఫ్యాన్స్ అంటున్నారు. ట్రైలర్ చూసి గూస్ బంప్స్ వస్తున్నాయి అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారితే ఎలా ఉంటుందో అదే ఈ సినిమా కథ. ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతోంది. సలార్ టీజర్ లో ప్రభాస్ ఫేస్ ను చూపించలేదు. కానీ.. ట్రైలర్ లో మాత్రం ప్రభాస్ యాక్షన్ మొత్తం చూపించారు. ప్రభాస్ చేసే ఫైట్ సీన్స్ మామూలుగా ఉండవు. ఈ సినిమాలో ప్రభాస్ పేరు దేవా. మలయాళం హీరో పృథ్వీరాజ్ మరో కీలక పాత్రలో నటించాడు. శృతి హాసన్ హీరోయిన్. ఇంకెందుకు ఆలస్యం.. సలార్ ట్రైలర్ పై ఓ లుక్కేయండి మరి.

Breaking News 2

No bio available for this author.

  1. "Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించ‌ని భారీ ట్విస్ట్.. ఈసారి ఎలిమినేట్ అయ్యిది కంటెస్టెంట్..!"

  2. "Jabardasth Faima Pregnancy : జబర్దస్త్ ఫైమా ప్రెగ్నెన్సీ వార్తలో ట్విస్ట్.. నెటిజన్ల ఫైర్ అస‌లేం జ‌రిగిందంటే..?"

  3. "Bigg Boss Telugu 10 : అతను చాలా మంచివాడు.. ఓటేసి గెలిపించండి.. జిమ్ జిమ్ తార లక్ష్మీదేవి వీడియో వైరల్..!"

  4. "Jio Plan : గుడ్‌న్యూస్‌.. జియోలో రూ.123కే రీఛార్జ్ ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ, 14GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్..!"

  5. "Railway Ticket Price : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 47 రైళ్ల టికెట్ ధరలు తగ్గింపు"

  6. "Scene Movie Review : సీన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!"

  7. "Ration Card : తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల పథకం వారికే..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp