Home » Entertainment » Prabhas Salaar Release Date Is Announced By Makers On April 14 2022
Entertainment

salaar : ప్రభాస్ సలార్ నుంచి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసిన మేకర్స్..!

Authored By
vamana sai
The Telugu News | Updated on: February 28, 2021 4:21 pm
Advertisement

salaar : ప్రభాస్ సలార్ టైటిల్ తో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ లో నటిస్తున్నాడన్న విషయం తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అయ్యే సాలీడ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. కేజీఎఫ్ చిత్రాలతో ప్రపంచ స్థాయిలో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి ప్రభాస్ కేవలం 35 రోజుల డేట్స్ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది.

Advertisement

ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఈ సినిమాని 100 రోజుల్లో టాకీపార్ట్ కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడట. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ మీద తెలుగుతో పాటు మిగాతా భాషల సినిమా ఇండస్ట్రీలలో సలార్ సినిమా గురించి ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. ఈ సినిమాని ఈ ఏడాదే రిలీజ్ చేస్తారా లేక వచ్చే ఏడాది రిలీజ్ చేస్తారా అని ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే ఈ ఏడాదిలో రిలీజ్ అయ్యే ప్రభాస్ రాధే శ్యాం, కేజీఎఫ్ ఛాప్టర్ 2, ఆచార్య, ఆర్ ఆర్ ఆర్, పుష్ప, లైగర్ లాంటి పాన్ ఇండియన్ సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్సైపోయాయి.

Advertisement

salaar : ప్రభాస్ సలార్ ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14 2022 న రిలీజ్..!

ఈ క్రమంలో సలార్ సినిమా ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారో అన్న ఉత్కంఠత అందరిలోనూ నెలకొంది. కాగా తాజాగా సలార్ సినిమా మేకర్స్ ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు అధికారంగా ప్రకటించారు. ఏప్రిల్ 14 2022 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రభాస్ పోస్టర్ ని రిలీజ్ చేస్తూ అధికారకమైన రిలీజ్ డేట్ ని ప్రకటించారు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోనూ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సలార్ దర్శక, నిర్మాతల ప్లాన్ మాత్రం నిజంగా అదిరిపోయిందని అంటున్నారు. ఇక ప్రభాస్ ని ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ ఎంతో పవర్ ఫుల్ క్యారెక్టర్ లో చూపించబోతున్నాడని ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ సలార్ అన్న టైటిల్ తోనే అర్థమవుతోంది.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి