Jagapathi babu : జగపతి బాబు కి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అప్పట్లో శోభన్ బాబు.. ఆ తర్వాత జగపతి బాబు అన్నంతగా ఫ్యామిలీ ఆడియన్స్ పరంగా విపరీతమైన క్రేజ్ ని తెచ్చుకున్నాడు. కుటుంబ కథా చిత్రాలలో నటిస్తూ మంచి క్రేజ్ అండ్ ఫాంలో ఉన్న జగపతి బాబు మధ్యలో రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం సినిమాలో కూడా నటించి తనలోని వెర్సటైల్ యాక్టర్ ని బయట పెట్టాడు. ఇక క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన అంతఃపురం సినిమాలో నటించి తనలోని మరో కోణాన్ని చూపించాడు.
jagapathi-babus-wound-is-not-healed-yet
జోనర్ ఏదైనా జగపతి బాబు తన మార్క్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొని బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. తండ్రి వి.బి.రాజేంద్ర ప్రసాద్ పెద్ద నిర్మాత అయినప్పటికి జగపతి బాబు మాత్రం తన సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు. ముఖ్యంగా అంతఃపురం సినిమాలో చేసింది చిన్న క్యారెక్టర్ అయినప్పటికి హీరో కంటే పాపులారిటీ జగపతి బాబు దక్కించుకున్నాడు. అంతేకాదు ఈ క్యారెక్టర్ ని బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ చేశాడు. అయితే జగపతి బాబు నటనతో పోల్చుకొని స్వయంగా షారుక్ అతని లా నేను చేయలేకపోయాయని చెప్పిన సందర్భం కూడా ఉంది.
ఇక మల్టిస్టార్ సినిమాలకి జగపతిబాబు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. అంతటి క్రేజ్ ఉన్న హీరో.. కొత్తతరం హీరోలు రావడం తో కెరీర్ గాడి తప్పింది. ఒకానొక సందర్భంలో ఇక సినీ కెరీర్ క్లోజ్ అని కూడా అనుకున్నాడు. ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జగపతి బాబు కి ఆ గాయం ఎప్పటికి మాననిది. అయితే అనూహ్యంగా బాలకృష్ణ – బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ సినిమాతో జగపతి బాబు కెరీర్ మళ్ళీ ఊపందుకుంది. స్టార్ హీరోలకి ఏ మాత్రం తగ్గని క్రేజ్ అండ్ ఫాపులారిటీ సాధించాడు.
హీరోగా చేసిన సినిమాలంటే ఇప్పుడు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు జగపతి బాబు కోసం కొత్త తరహా క్యారెక్టర్స్ తయారవుతున్నాయి. స్టైలిష్ ఫాదర్.. స్టైలిష్ విలన్..లాంటి పాత్రలతో పాటు అరవింద సమేత సినిమాలో చేసినటువంటి మాసివ్ విలన్ క్యారెక్టర్స్ జగపతి బాబు కోసం పుడుతున్నాయి. లెజెండ్ సినిమాతో మళ్ళి లైఫ్ వచ్చిన జగపతి బాబు ఎన్ని విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పిస్తున్నాడో అందరికీ తెలిసిందే. పోగొట్టుకున్నవన్ని మళ్ళీ రాబట్టుకొని స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్నాడు.
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
This website uses cookies.