Home » Entertainment » Prabhas Science Fiction Movie Is On Sets Nag Ashwin Is Going To Compete With The Other Two
Entertainment

Prabhas : ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ సెట్స్ మీదకి .. ఆ ఇద్దరికీ పోటీ కాబోతున్న నాగ్ అశ్విన్..!

Authored By
vamana sai
The Telugu News | Published on: March 1, 2021, 7:30 pm
Advertisement

Prabhas : ప్రభాస్ కమిటయిన పాన్ ఇండియన్ సినిమాలలో సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న సినిమా కూడా ఉంది. ఈ సినిమాకి మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి.అశ్వనీదత్ సమర్పణలో స్వప్న దత్, ప్రియాంక దత్ దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దాదాపు సంవత్సరం నుంచి ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. వాస్తవంగా ప్రస్తుతం ప్రభాస్ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రాధే శ్యాం సినిమా తర్వాత మొదలవ్వాల్సిన ప్రాజెక్ట్ ఇదే.

Advertisement

prabhas-science-fiction-movie-is-on-sets-nag-ashwin-is-going-to-compete-with-the-other-two

అయితే రాధే శ్యాం కరోనా కారణంగా డిలే అవడం తో ఈ ప్రాజెక్ట్ కూడా ఆలస్యం అయింది. మధ్యలో ప్రభాస్ సలార్, తో పాటు ఆదిపురుష్ కమిటవడం .. ముందు ఈ రెండు సినిమాలకి డేట్స్ సర్దుబాటు చేయడంతో నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేయాల్సిన ప్రాజెక్ట్ డిలే అయింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కూడా మొదలవబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ తో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం ఆది పురుష్ సెట్స్ మీద ఉన్నాయి.

Advertisement

Prabhas : ప్రభాస్ నాగ్ అశ్విన్ తెరకెక్కించబోతున్న సినిమాకి డేట్స్ ఇచ్చాడట..!

ఈ రెండు సినిమాలు సమాంతరంగా షూటింగ్ జరుగుతున్నాయి. ప్రభాస్ రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఇప్పటికే ఆదిపురుష్ సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. 2022 ఆగస్టు 11 ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ రిలీజ్ కాబోతోంది. ఇక తాజాగా సలార్ సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో జూలై నుంచి ప్రభాస్ – నాగ్ అశ్విన్ సినిమా సెట్స్ మీదకి రానుందట. సలార్, ఆదిపురుష్ సినిమాలతో పాటు వైజయంతీ మూవీస్ లో నాగ్ అశ్విన్ తెరకెక్కించబోతున్న సినిమాకి డేట్స్ ఇచ్చాడట. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ .. దీపిక పదుకొణె, బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి