Liger : లైగర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబై లో శరవేగంగా సాగుతోంది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సెప్టెంబర్ 9న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని మేకర్స్ ఇటీవలే పోస్టర్ ని రిలీజ్ చేస్తూ ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే లైగర్ లో హీరోయిన్ గా నటిస్తుండగా విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాకి పెట్టిన సాలా క్రాస్ బ్రీడ్ అన్న ట్యాగ్ తో పూరి మార్క్ సినిమా అని అందరూ ఫిక్సైపోయారు.
ఇక ఈ సినిమా గురించి ఇటు టాలీవుడ్ .. అటు బాలీవుడ్ జనాలందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ పూరి జగన్నాధ్ నుంచి రాబోతున్న సినిమా కావడం తో ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ కి లైగర్ తో భారీ హిట్ ఇస్తాడని అందరూ నమ్మకంగా చెపుకుంటున్నారు. ఇక ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యారస్ పై కరణ్ జోహార్, పూరి జగన్నాధ్ – ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమా తర్వాత పూరి జగన్నాధ్ బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్ ని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఆ సినిమానే ఇస్మార్ట్ శంకర్. రామ్, పూరి కాంబోలో వచ్చిన ఈ సినిమా ఇద్దరికి మంచి కం బ్యాక్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో రామ్ కి మాస్ హీరో ఇమేజ్ విపరీతంగా వచ్చేసింది. వాస్తవంగా ఇస్మార్ట్ శంకర్ తర్వాత డబుల్ ఇస్మార్ట్ శంకర్ టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించి సీక్వెల్ ప్లాన్ చేశారు. కానీ అనుకోకుండా ఈ సీక్వెల్ పెండిగ్ పడి ఇద్దరు వేరే వేరే ప్రాజెక్ట్స్ లో బిజీ అయ్యారు. అయితే లైగర్ తర్వాత రామ్, పూరి కాంబోలో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ పట్టాలెక్కబోతోందని తెలుస్తోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.