Prabhas : ప్రభాస్ పేరు ఎత్తగానే మనకు గుర్తొచ్చే సినిమా బాహుబలి. అవును.. బాహుబలి సిరీస్ తోనే ప్రభాస్ తన సత్తా చాటాడు. తనేంటో నిరూపించుకున్నాడు. పాన్ ఇండియా హీరో అయ్యాడు. తొలి పాన్ ఇండియా హీరో అవడమే కాదు.. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన ఘనత ప్రభాస్ కే దక్కుతుంది. అయితే.. బాహుబలి తర్వాత ప్రభాస్ తీసిన సినిమాలేవీ అంతగా ఆడలేదు. దానికి కారణం.. బాహుబలి లాంటి ఎక్స్ ట్రీమ్ క్యారెక్టర్ లో ప్రభాస్ ను చూసిన ఆయన అభిమానులు.. అంతకు మించిన క్యారెక్టర్ తో రావాలని కోరుకుంటున్నారు. సాహో, రాధేశ్యామ్ సినిమాలు అంతగా ఆడకున్నా కూడా ప్రభాస్ రేంజ్ మాత్రం అస్సలు తగ్గలేదు.
ఒక్క సినిమాకు ప్రభాస్ సుమారు 100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రాజెక్టు కే, సలార్ మూవీలు ప్రస్తుతం ఆయన చేతుల్లో ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో వచ్చే సినిమా మాత్రం పూర్తిగా కామెడీ మూవీ. ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు కానీ.. ప్రీ ప్రొడక్షన్స్ ను జరుపుకుంటోంది. రాధేశ్యామ్ సినిమాలో నటించిన భామ గుర్తుంది కదా. ఆ భామకు రాజా డీలక్స్ సినిమాలో చాన్స్ ఇవ్వాలని ప్రభాస్ అనుకున్నాడట. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది.
రెండో షెడ్యూల్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. మాళవిక మోహన్, ఆశిక రంగనాథ్, మెహ్రీన్ అని అంటున్నారు. అయితే.. మెహ్రీన్ ను పక్కన పెట్టి మూడో హీరోయిన్ గా రాధే శ్యామ్ లో నటించిన రిద్ధి కుమార్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభాసే కావాలని ఆ హీరోయిన్ ను తీసుకున్నాడట. రాధే శ్యామ్ లో తారా పాత్రలో రిద్ధి కుమార్ నటించిన విషయం తెలిసిందే. అయితే.. తనకు ఎలాంటి అవకాశాలు లేకపోయినా.. కావాలని ఈ సినిమాలోకి ప్రభాస్ తీసుకోవడం వెనుక ఉన్న కారణం ఏంటో మాత్రం తెలియదు. కానీ.. ఒక్కసారిగా తనకు పెద్ద సినిమాలో అవకాశం రావడంతో రిద్ధి కుమార్ ఎగిరి గంతేస్తోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.