Prabhu Deva his wife in Tirupati temple
Prabhu Deva : ఇండియన్ మైకల్ జాక్సన్ ప్రభుదేవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో హీరోగా నటించి మెప్పించారు. అలాగే ఎన్నో సినిమాలను దర్శకుడిగా, నిర్మాతగా, కొరియో గ్రాఫర్ గా వ్యవహరించారు. టాలీవుడ్ లో దర్శకుడిగా ఎన్నో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ లు అందుకున్నారు. మరీ ముఖ్యంగా సిద్ధార్థ , త్రిష నటించిన ‘ నువ్వొస్తానంటే నేనొద్దంటానా ‘ సినిమాతో ప్రభుదేవా స్టార్ డైరెక్టర్ అయ్యాడు. కేవలం టాలీవుడ్ లోనే కాదు తమిళ, హిందీ భాషలలో కూడా సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా ప్రభుదేవా గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇటీవల ప్రభుదేవా తన రెండో భార్య హిమానీ సింగ్ తో కలిసి తిరుపతి దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలోనే శ్రీవారి చెంతన కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. ముందుగా ఈమె ఎవరు అని అంతా సందేహపడ్డారు. తర్వాత ప్రభుదేవా రెండో భార్య అని ఫిక్స్ అయ్యారు. అయితే ప్రభుదేవా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. మూడేళ్ల కిందట హిమాని సింగ్ ను ప్రభుదేవా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వివాహం గురించి ప్రభుదేవా ఎక్కడా బయటికి చెప్పలేదు. ముందుగా ప్రభుదేవా రామలత అనే ఆమెను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తర్వాత నయనతార తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి.
Prabhu Deva his wife in Tirupati temple
అప్పట్లో నయనతార ప్రభుదేవా పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు కానీ చివరిలో ఆగిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి ప్రభుదేవా వెన్ను నొప్పితో బాధపడుతున్న సమయంలో తనకి చికిత్స అందిస్తున్న ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ హిమాని సింగ్ ను వివాహం చేసుకున్నట్లు కొన్ని నెలల తర్వాత తెలిసింది. ఆ విషయం ఇప్పటివరకు ప్రభుదేవా ప్రకటించలేదు. అంతేకాదు వీరిద్దరూ కలిసి ఎక్కడ బయట కూడా కనిపించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు బయటికి వచ్చేసరికి ప్రభుదేవా రెండో భార్య ఆమె అని కన్ఫర్మ్ అయింది. ఇక వీరికి ఒక పాప కూడా పుట్టినట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని ప్రభుదేవా అధికారికంగా చెప్పాల్సి ఉంటుంది. పెళ్లి విషయాన్ని గోప్యంగా ఉంచిన ప్రభుదేవా తనకు బిడ్డ పుట్టిన విషయాన్ని అయినా రివీల్ చేస్తాడా లేదా అనేది చూడాలి.
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
This website uses cookies.