Pragathi : క్యారెక్టర్ ఆర్టిస్టు ప్రగతి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తన కంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. తాను ఎంపిక చేసుకునే ప్రతి స్కిప్టు తనకు పేరు తెచ్చేదిగా ఉండాలని ఈ నటి భావిస్తుంటుందట.. సాధారణంగా ఏజ్ బార్ అయిన ఆర్టిస్టులు పెద్దగా కష్టపడరు. తల్లి, వదిన, అత్త వంటి క్యారెక్టర్స్ చేస్తుంటారు. వీరు పెద్దగా కష్టపడాల్సిన పని ఉండదు. కష్టపడాల్సిన వారు ఎవరంటే హీరోహీరోయిన్లు. వీరికి ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. కానీ ప్రగతి మాత్రం తెగ కష్టపడుతోందట.
యాక్టర్ ప్రగతి క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న విషయం తెలిసిందే.
తెలుగులో ఇప్పటివరకు వందల సినిమాలు చేసిన ఈ నటి.. ఈ మధ్యకాలంలో చాలా బరువెక్కింది. ఇప్పటి తరం క్యారెక్టర్ ఆర్టిస్టులు ఆరోగ్యం మీద ఫిట్నెస్ మీద అధికంగా శ్రద్ధ పెడుతున్నారట.. అందుకు బెస్ట్ ఉదా.. యాక్టర్ ప్రగతి అని చెప్పుకోవచ్చు. అప్పట్లో మీడియంగా ఉండే ఈ నటి ఒక్కసారిగా బరువు పెరగడంతో కొవ్వు కరిగించేకు తెగ కష్టపడుతోందట. తోటి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఫిట్నెస్ విషయంలో జాగ్రత్తగా ఉండటం గమనించి ఈవిడ కూడా జిమ్‌లో జాయిన్ అయ్యిందట.. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం జిమ్‌లో కొవ్వు కరిగించేందుకు తెగ శ్రమిస్తోందని టాక్ వినిపిస్తోంది.
Pragathi Latest Workout Video
ఈ రోజుల్లో ఫిట్ గా ఉండాలంటే వ్యాయామం, యోగా తప్పనిసరి అని ఈ నటి తెలుసుకున్నట్టు ఉంది. అందుకే ప్రతిరోజూ క్రమం తప్పకుండా జిమ్ చేస్తుందట.. ప్రగతికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం.అందుకోసం డ్యాన్స్ కూడా ట్రై చేస్తుందట.. డ్యాన్స్ వలన కేలరీలు కరిగించాలని కూడా యోచిస్తుందట.. ఈ మధ్యకాలంలో నటి ప్రగతి జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తోంది. తాజాగా ప్రగతి షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బ్లాక్ కలర్ జిమ్ డ్రెస్సులో కొవ్వు కరిగించేందుకు జంపింగ్స్ చేస్తోంది. బాక్సింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఆమె చేతులను చూస్తే ఇట్టే అర్థం అవుతుంది. ఈ వయసులో జిమ్ చేయడం ఫిట్నెస్ పరంగా, ఆరోగ్యానికి, గ్లామర్‌కు కూడా చాలా మంచిదని కొందరు అంటున్నారు.
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.