Prakash Raj : ‘మా’ సభ్యత్వానికి ప్రకాశ్‌రాజ్ రాజీనామా.. ఇక తెలుగు సినిమాలు చేస్తారా?

Authored By praveen T | The Telugu News | Published on: October 11, 2021, 12:55 pm

Prakash Raj : విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవికి పోటీ చేసి హీరో మంచు విష్ణు చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ‘మా’ ఎన్నికలు ప్రాంతీయత ఆధారంగా జరిగాయని, తాను తెలుగు వాడిని కాదని , అతిథిగా వచ్చానని అలానే ఉంటానని చెప్పారు.

prakas resigned to maa membership

prakas resigned to maa membership

తెలుగువాళ్లు మాత్రమే మా అధ్యక్షుడిగా కావాలనే తీర్పు వచ్చిందని, దానిని తాను గౌరవిస్తానని తెలిపారు. అయితే, తనకు మాలో 21 ఏళ్ల అనుభవం ఉందని, తన పేరెంట్స్ తెలుగు వారు కాదని, అది వారు చేసిన తప్పు కాదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తనను నాన్ లోకల్ అన్న రఘుబాబు, కోట శ్రీనివాసరావు వ్యాఖ్యలను తాను గౌరవిస్తానని ప్రకాశ్ పేర్కొన్నారు.

తాను ఆత్మాభిమానం ఉన్న వాడికి కాబట్టి మా సభ్యత్వానికి రాజీనామా చేశానని చెప్పారు. అయితే, మా సభ్యుడిగా లేకపోయినప్పటికీ తాను అన్ని సినిమాలలో నటిస్తానని, తెలుగు సినిమాలు చేస్తానని, కానీ అసోసియేషన్‌లో ఉండబోనని వివరించారు. ఇకపోతే మెగా బ్రదర్ నాగబాబు కూడా మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

praveen T

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp