Pranitha : అమ్మైన కూడా అస్సలు తగ్గనంటున్న ప్రణీత.. ఇలా చూపిస్తే ఇచ్చేస్తారా..!
Pranitha : బుట్టబొమ్మగా తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న ముద్దుగుమ్మ ప్రణీత. బాపు బొమ్మగా తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది ఈ అందాల భామ. చేసింది కొన్ని సినిమాలే అయిన మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. అందానికి అందం, నటనకు నటన చేయగల సత్తా ఉన్నా.. ఈ అమ్మడు సరైన అవకాశాలను సొంతం చేసుకోలేకపోయింది. ఫలితంగా టాలీవుడ్‌కు దూరం అయిపోయింది. ఈ క్రమంలోనే ప్రణిత ఇటీవలే ఓ బిడ్డకు తల్లైన విషయం తెలిసిందే. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు ఎప్పటికప్పుడు తన క్యూట్ పిక్స్ షేర్ చేస్తుంటూ నెటిజన్స్‌కి మంచి వినోదం పంచుతూ ఉంటుంది.
Pranitha : కలిసి రావడం లేదు పాపం…
ఎప్పుడు సంప్రదాయంగా , లక్షణంగా కనిపించే ప్రణతి ట్రెండ్ మార్చింది. తల్లైన తర్వాత కూడా ప్రణీత తన అందాల ఫొటో షూట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది. ఘాటు అందాలతో హీటెక్కించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఎన్ని గ్లామర్ పిక్స్ షేర్ చేసినా ప్రణీతను పట్టించుకునే వారు లేనప్పుడు లాభం ఏంటో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు మన మేకర్స్ ఫ్రెష్ సరుకు కోసం చూస్తుండగా, పెళ్లై తల్లైన ఈ హీరోయిన్‌ని పట్టించుకుంటారా అనే సందేహం అందరిలో కలుగుతుంది. ఏదేమైన ఈ అమ్మడు ఘాటు అందాల ఆరబోత నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది ప్రణీత సుభాష్. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. అయినా అమ్మడికి అవకాశాలు బాగానే వచ్చాయి. ఏకంగా పవన్ కళ్యాణ్ సరసన నటించేసింది. అత్తారింటికి దారేది సినిమాలో సమంతతో పాటు ప్రణీత బాగానే ఆకట్టుకుంది. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే ప్రణిత సుభాష్ మోడలింగ్ రంగంలో సందడి చేసింది. ఈ క్రమంలోనే ‘పోర్కి’ అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ వెంటనే ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ అనే సినిమాతో తెలుగులోకి కూడా అడుగు పెట్టింది. ఆరంభంలోనే క్యూట్ లుక్స్‌తో మాయ చేసిన ఈ బ్యూటీ.. అందరి దృష్టినీ ఆకర్షించడంతో పాటు పాపులర్ అయింది.