Bigg Boss Telugu 7 : మొదటి కెప్టెన్‌గా రికార్డు సృష్టించిన ప్రశాంత్.. శివాజీ మాట నిలబెట్టాడు.. బిక్కమొహం వేసిన స్టార్ మా బ్యాచ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bigg Boss Telugu 7 : మొదటి కెప్టెన్‌గా రికార్డు సృష్టించిన ప్రశాంత్.. శివాజీ మాట నిలబెట్టాడు.. బిక్కమొహం వేసిన స్టార్ మా బ్యాచ్

Bigg Boss Telugu 7 : అది లెక్క.. మాటలు మాట్లాడటం కాదు. చేతల్లో చేసి చూపిస్తా అని అనడం కాదు.. చేసి చూపించాడు ప్రశాంత్. అతడి సత్తాను ముందు చూసింది శివాజీనే. అందుకే శివాజీ ఫస్ట్ నుంచి ప్రశాంత్ కు మద్దతు ఇస్తూనే వస్తున్నాడు. తాజాగా తన లెటర్ ను కూడా త్యాగం చేసి ఫస్ట్ కెప్టెన్ కంటెండర్ నుంచి తప్పుకున్నాడు శివాజీ. ప్రశాంత్ కు చాన్స్ ఇచ్చాడు. ప్రశాంత్ కోసం త్యాగం చేసినా ప్రశాంత్ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :7 October 2023,10:00 am

Bigg Boss Telugu 7 : అది లెక్క.. మాటలు మాట్లాడటం కాదు. చేతల్లో చేసి చూపిస్తా అని అనడం కాదు.. చేసి చూపించాడు ప్రశాంత్. అతడి సత్తాను ముందు చూసింది శివాజీనే. అందుకే శివాజీ ఫస్ట్ నుంచి ప్రశాంత్ కు మద్దతు ఇస్తూనే వస్తున్నాడు. తాజాగా తన లెటర్ ను కూడా త్యాగం చేసి ఫస్ట్ కెప్టెన్ కంటెండర్ నుంచి తప్పుకున్నాడు శివాజీ. ప్రశాంత్ కు చాన్స్ ఇచ్చాడు. ప్రశాంత్ కోసం త్యాగం చేసినా ప్రశాంత్ ఆ చాన్స్ ను అస్సలు మిస్ చేసుకోలేదు. టాస్క్ లో తన సత్తా చాటాడు. మొదటి కెప్టెన్ అయి స్టార్ మా బ్యాచ్ కు షాకిచ్చాడు. ముఖ్యంగా అమర్ దీప్ అయితే.. ప్రశాంత్ మొదటి కెప్టెన్ అవ్వడాన్ని అస్సలు తట్టుకోలేకపోయాడు. అమర్ దీప్, సందీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్ అయితే అస్సలు తట్టుకోలేకపోయారు. వాళ్లకు ఏం చేయాలో అర్థం కాలేదు.

టీషర్ట్స్ మీద కలర్స్ కొట్టుకోవాలని.. బర్జర్ మోగే లోపు ఎవరి టీషర్ట్ మీద తక్కువ రంగులు ఉంటాయో వాళ్లే ఈ టాస్క్ లో విన్ అయినట్టు అని ప్రియాంకను సంచాలక్ గా నియమిస్తాడు బిగ్ బాస్. ఫస్ట్ రౌండ్ లోనే తేజ అవుట్ అయితాడు. ఆ తర్వాత రెండో రౌండ్ లో మాస్టర్ బయటికి వెళ్లిపోతాడు. ఇక మూడో రౌండ్ లో ప్రశాంత్, గౌతమ్ ఇద్దరూ చాలా టఫ్ ఫైట్ ఇస్తారు. ఇద్దరూ ఏమాత్రం తగ్గరు. ప్రశాంత్ అయితే చిరుతలా దూకుతాడు. చిరుతలా గౌతమ్ మీద దూకి ఎక్కడికక్కడ కట్టడి చేస్తాడు. బర్జర్ మోగే వరకు తనలో ఉన్న కసిని ప్రతి ఒక్క ప్రేక్షకుడు చూస్తాడు. ఆ కసితోనే శివాజీ మాట నిలబెడతాడు ప్రశాంత్. చివరకు మొదటి కెప్టెన్ అని చరిత్ర సృష్టిస్తాడు.

prashanth is the first captain of bigg boss telugu 7

#image_title

Bigg Boss Telugu 7 : టాప్ 5 లో ప్రశాంత్ కన్ఫమ్

ప్రశాంత్ ఆట ఆడటం చూస్తుంటే ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటాడు అనిపిస్తోంది. శివాజీ మద్దతుతో ప్రశాంత్ చాలా బాగా ఆడుతున్నాడు. ప్రేక్షకుల మనసు కూడా గెలుచుకుంటున్నాడు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న పరిస్థితి చూస్తుంటే టాప్ 5 లో శివాజీ, యావర్, ప్రశాంత్, గౌతమ్ ఖచ్చితంగా ఉంటారనిపిస్తోంది. ఇక.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో క్లారిటీ రావడం లేదు. చాలామంది అమర్ దీప్ అంటున్నారు. మరికొందరు తేజ, ప్రియాంకలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అంటున్నారు. చూద్దాం మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది