Jabardasth Faima : ప్ర‌వీణ్ నెంబ‌ర్ బ్లాక్ చేసిన ఫైమా.. క‌న్నీరు పెట్టుకున్న ప్రియుడు

Authored By Sam C | The Telugu News | Published on: July 14, 2022, 9:30 pm

Jabardasth Faima : పటాస్​తో బుల్లితెరకు పరిచయమై జబర్దస్త్​, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో ప్రేక్షకులకు దగ్గరైన ఆర్టిస్ట్​లు ప్రవీణ్​, ఫైమా. ఈ ఇద్ద‌రు అచ్చ‌మైన తెలంగాణ భాష‌లో మాట్లాడుతూ ప్రేక్ష‌కుల‌కి పసందైన వినోదం పంచే వారు. సుధీర్​-రష్మీ​లాగే ఫైమా-ప్రవీణ్​ కాంబినేషన్​కూ చాలా మంది ఫ్యాన్స్​ ఉన్నారు. ఫైమా దెబ్బకు గెటప్ శ్రీను వంటి వారే భయపడుతున్నారు. ఆమెలోని కొత్త కోణాన్ని చూపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె ఎవరి టీంలో చేసినా సరే తన మార్క్‌ని మాత్రం చూపించేస్తోంది. ఫైమా, ప్రవీణ్ మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ రూమర్లు చక్కర్లు కొట్టేసింది. ఇక ఇద్దరూ కలిసి ఉన్న వీడియోలు, ఫోటోలు, ప్రొఫైల్ పిక్స్ అన్నీ కూడా నెట్టింట్లో వైరల్ అవుతూ వస్తుండేవి.

అయితే ఈ మ‌ధ్య వారిద్ద‌రు ల‌వ్‌లో ఉన్న‌ట్టు ఒప్పుకున్నారు. 2019లో ప్ర‌వీణ్ ప్ర‌పోజ్ చేసిన‌ట్టు చెప్పుకొచ్చాడు. అయితే ఇద్ద‌రి మధ్య ఓ సారి ఏదో గొడ‌వ జ‌రిగిన‌ప్పుడు ఫైమా ప్ర‌వీణ్ నెంబ‌ర్ బ్లాక్ చేయ‌గా, అప్పుడు కాల్ చేసి ఏడ్చేశాడట‌. ఈ విషయాన్ని తాజా ఇంట‌ర్వూలో చెప్పుకొచ్చింది ఫైమా. విడిపోయిన స‌మ‌యంలో ప్ర‌వీణ్ చాలా బాధ‌ప‌డ్డ‌ట్లు కూడా ఫైమా పేర్కొంది. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు చాలా హ్యాపీగా ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో జబర్దస్త్ ఫైమా, ప్రవీణ్ ల ప‌ర్‌ఫార్మెన్స్ ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ జంట లవ్ ప్రపోజల్ హైలైట్ గా నిలిచింది. తాజాగా ప్రోమో విడుద‌ల కాగా, ఇందులో ఏకంగా రింగ్ తీసుకొచ్చి మరీ ప్రవీణ్.. మోకాళ్లపై కూర్చొని ఫైమాకు ‘ఐ లవ్ యూ’ అని చెప్పాడు.

praveen number blocked by Jabardasth Faima

praveen number blocked by Jabardasth Faima

Jabardasth Faima : పాపం ప్ర‌వీణ్..

అలాగే మీ అమ్మకు అల్లుడు వస్తున్నాడని చెప్పు అని అనడంతో ఫైమా ఎమోషనల్ అయిపోయింది. ప్రస్తుతం ప్రవీణ్ – ఫైమాల లవ్ ప్రపోజల్ సీన్ నెట్టింట వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగిందనేది ఆదివారం పూర్తి ఎపిసోడ్ లో చూడాలి. ఇక నాకు ఫైమా ఎందుకు నచ్చిందంటే.. ఆమె తను అనుకున్నది సాధించింది. ఫైమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వాళ్ల అమ్మగారు ఓ కోరిక కోరారు. తమ కంటూ ఓ ఇల్లు ఉండాలని, అందుకే ఓ ఇల్లు కట్టు అని అన్నారు. తాను ఒకవేళ చనిపోతే సొంతింట్లోనే చనిపోవాలన్నారు. ఆవిడ కోరినట్టుగానే ఫైమా నిజంగా తన సొంతింటి కలను నెరవేర్చింది. అందుకే తనంటే నాకు ఇష్టం. ఫైమా మీ అమ్మకు చెప్పు అల్లుడు వస్తున్నాడని అంటూ ప్ర‌వీణ్ పంచ్‌లు పేల్చాడు. ఇవి ఆక‌ట్టుకుంటున్నాయి.

Sam C

No bio available for this author.

  1. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  2. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  3. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  4. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  5. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  6. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  7. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp