Faima : తొలిసారి ప్ర‌వీణ్‌తో బ్రేక‌ప్‌పై స్పందించిన ఫైమా.. అంత గొడ‌వ జ‌రిగిందా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Faima : తొలిసారి ప్ర‌వీణ్‌తో బ్రేక‌ప్‌పై స్పందించిన ఫైమా.. అంత గొడ‌వ జ‌రిగిందా?

Faima : ఫైమా, పటాస్ ప్రవీణ్ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విష‌యం తెలిసిందే. జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్లుగా పనిచేస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు. వీరిద్దరి మధ్య ప్రేమ కూడా చిగురించిందని ఇద్దరు ప్రేమలో ఉన్నారు అంటూ అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేశాయి. బిగ్ బాస్ లో ఉన్న‌ప్పుడు ఫైమా స్వ‌యంగా ప్ర‌వీణ్‌తో ప్రేమ‌లో ఉన్న విష‌యం తెలిపింది. అయితే ఏమైందో ఏమోగాని కొన్నాళ్ల నుండి వీరిద్ద‌రు క‌లిసి క‌నిపించ‌డం లేదు. […]

 Authored By ramu | The Telugu News | Updated on :6 May 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Faima : తొలిసారి ప్ర‌వీణ్‌తో బ్రేక‌ప్‌పై స్పందించిన ఫైమా.. అంత గొడ‌వ జ‌రిగిందా?

Faima : ఫైమా, పటాస్ ప్రవీణ్ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విష‌యం తెలిసిందే. జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్లుగా పనిచేస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు. వీరిద్దరి మధ్య ప్రేమ కూడా చిగురించిందని ఇద్దరు ప్రేమలో ఉన్నారు అంటూ అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేశాయి. బిగ్ బాస్ లో ఉన్న‌ప్పుడు ఫైమా స్వ‌యంగా ప్ర‌వీణ్‌తో ప్రేమ‌లో ఉన్న విష‌యం తెలిపింది. అయితే ఏమైందో ఏమోగాని కొన్నాళ్ల నుండి వీరిద్ద‌రు క‌లిసి క‌నిపించ‌డం లేదు. ఈ జంట కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. బయటకు వీళ్ళిద్దరు ప్రేమికలని ఎక్కువగా వినిపిస్తుండ‌గా, వారిద్ద‌రు ప‌లు కార‌ణాల‌తో విడిపోయార‌ని కొంద‌రు చెబుతున్నారు.

Faima : తొలిసారి స్పందించిన ఫైమా..

కేవలం పటాస్, జబర్దస్త్ లలో మాత్రమే కాకుండా పైమా ఓ యూట్యూబ్ ఛానెల్ లో కూడా ప్రవీణ్ తో లవ్ ట్రాక్ నడిపింది. అదే కాకుండా సుమన్ టీవీ వాళ్లు చేసిన ఓ ఇంటర్వ్యూలో కూడా వీరిద్దరి ప్రేమ గురించి వివరించింది. ఆ స‌మ‌యంలోనే వీరిద్దరూ నిజమైనే ప్రేమికులే అని అంతా తెలుసుకున్నారు. ఇక ఫైమా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా ప్రవీణ్ తో తన జర్నీ గురించి వివరించింది. ఈక్రమంలోనే ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ 6కు ఎంపికై అక్కడకు వెళ్లింది. అందులో అద్భుత‌మైన ఆట ప్ర‌ద‌ర్శించిన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ లో ప్రవీణ్ గురించి కూడా ప‌లు సంద‌ర్భాల‌లో ప్ర‌స్తావించింది.

Faima తొలిసారి ప్ర‌వీణ్‌తో బ్రేక‌ప్‌పై స్పందించిన ఫైమా అంత గొడ‌వ జ‌రిగిందా

Faima : తొలిసారి ప్ర‌వీణ్‌తో బ్రేక‌ప్‌పై స్పందించిన ఫైమా.. అంత గొడ‌వ జ‌రిగిందా?

అయితే బిగ్ బాస్ హౌజ్ బయటకు వచ్చిన తర్వాతన నుంచి మాత్రం ప్రవీణ్ తో కలిసి కనిపించలేదు. అలాగే తన యూట్యూబ్ ఛానెల్ లో కూడా వీడియోలు పెట్టలేదు. ఇదే విషయం అందరూ అడగ్గా.. ప్రవీణ్ పై ప్రేమ లేదని.. ప్రజల్ని అబద్ధాలు చెప్పి మోసం చేయడం ఇష్టలేకే కలిసి కనిపింట్లేదంటూ అప్పట్లో చెప్పుకొచ్చింది. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఫైమా మాట్లాడుతూ.. ప్రవీణ్ నా మధ్య కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉన్నాయ‌ని, అవి చెప్పుకోలేనివ‌ని పేర్కొంది. ఆ కార‌ణాల వ‌ల్ల‌నే నేను అత‌నికి దూరం కావాల్సి వచ్చింది అని తెలియ‌జేసింది.. ప్రవీణ్ కి పేరెంట్స్ లేరు. అతడు ఇంటర్వ్యూలలో చెప్పే మాటలు సింపథికీ దారితీస్తాయి. అదే సమయంలో నన్ను బ్యాడ్ చేస్తాయి. అది కరెక్ట్ కాదని.. ఫైమా పేర్కొంది. ఆమె మాట తీరుని బ‌ట్టి చూస్తుంటే ఇద్ద‌రి మ‌ధ్య పెద్ద గొడ‌వ‌లే జరిగాయని అర్ధ‌మ‌వుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది