Bakasura Restaurant Movie : బకాసుర రెస్టారెంట్ ఎంటర్‌టైన్ చేస్తూనే అందరి హృదయాలను హత్తుకుంటుంది : నటుడు ప్రవీణ్
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రవీణ్. ఆయన తొలిసారిగా హీరోగా నటిస్తున్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం హారర్ థ్రిల్లర్, కామెడీ, ఎమోషన్ అన్నీ రకాల అంశాల మేళవింపుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎస్‌జే శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్ ,షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్,ఇతర ముఖ్య పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నెల 8న చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా నటుడు ప్రవీణ్‌తో జరిపిన ఇంటర్వ్యూ ఇది..
Bakasura Restaurant Movie : బకాసుర రెస్టారెంట్ ఎంటర్‌టైన్ చేస్తూనే అందరి హృదయాలను హత్తుకుంటుంది : నటుడు ప్రవీణ్
ఈ సినిమా ఐదు పాత్రలతో నడుస్తుంది. ఇందులో కథను నడిపించే పరమేష్ అనే పాత్రలో నేను కనిపిస్తాను. నా పాత్రలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్ కూడా ఉంటుంది. నా పాత్రకు ఉండే ఓ యాంబిషన్ ఎలా ఫుల్‌ఫిల్ అయ్యింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది.
నిజం చెప్పాలంటే ఇది కొంచెం బరువే. పర్‌ఫార్మెన్స్ వైజ్ నాది రెగ్యులర్ పాత్ర కాదు. కథలో హారర్, థ్రిల్లర్, మైథాలజీ ఇలా అన్నీ మిక్స్ అయ్యాయి. ఐదు పాత్రలున్న కథను నడిపించే పాత్ర కావడంతో కాస్త టెన్షన్‌గానే ఉంది. అయితే సినిమాను దర్శకుడు ఎంతో క్లారిటీగా తెరకెక్కించాడు. అయితే సినిమాను మంచి ప్రమోషన్‌తో బయటికి తీసుకరావాల్సిన బాధ్యత నాపై ఉంది. ఈ విషయంలో నాకు సినీ పరిశ్రమలోని అందరూ సహకరిస్తున్నారు.
ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్ కూడా ఉంటుంది. నా పాత్రలో ఎమోషన్‌ను పండించడమే నాకు చాలెంజింగ్‌గా అనిపించింది. ఓ పెయిన్‌ఫుల్ ఎమోషన్‌తోనే ఈ కథ ఎండ్ అవుతుంది.
ఇదొక కాన్సెప్ట్ కథ. ఆ తిండిబోతు దెయ్యం పెట్టే ఇబ్బంది చాలా ఎంటర్‌టైనింగ్‌గా.. ఎమోషన్‌ల్‌గా ఉంటుంది.
అనుకున్న బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువైనా అవుట్‌పుట్ చాలా సంతృప్తిగా ఉంది. సినిమా ప్రతి ఒక్కరికి తప్పకుండా నచ్చుతుంది.
అలాంటిదేమీ లేదు. అసలు నేను హీరోగా ఫీలయితే అలాంటి ఫీలింగ్ అందరిలో వస్తుంది. నేను ఓ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నాననే భావనలో మాత్రమే ఉన్నాను .ప్రస్తుతం నేను విశ్వంభర, ఉస్తాద్ భగత్ సింగ్, మాస్ జాతర, లెనిన్, ఆకాశంలో ఓ తార చిత్రాలతో బిజీగా ఉన్నాను. నాకు దర్శకుడి ఎలాంటి పాత్రను ఇచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
శిరీష్ గారు సినిమా చూసి మంచి కథను ఎంచుకున్నారు అన్నారు. సినిమా ఆయనకు బాగా నచ్చింది. అందుకే ఎస్వీసీ ద్వారా విడుదల చేస్తున్నాం.
ముఖ్యంగా పతాక సన్నివేశాలు చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. మన జీవితంలోకి వచ్చిన మంచి స్నేహితుడు అనివార్యా కారణాల వల్ల వెళ్లిపోవాల్సి వస్తే మనలో ఓ పెయిన్ ఉంటుంది. ఈ కైండ్ ఆఫ్ ఎమోషన్ ఈ సినిమాలో కూడా ఉంటుంది. ఇది అందరి హృదయాలకు హత్తుకుంటుంది.
వర్క్‌లో ఉన్న ప్రెజర్‌ని ప్లెజర్‌గా మార్చుకోవడమే నాకు తెలిసింది. ఏ సినిమాకైనా కష్టం ఉంటుంది.
అన్ని పాత్రలు చేస్తాను. కానీ లీడ్ రోల్ మాత్రం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలని వుంది. ఎందుకంటే కమెడియన్‌గా ఇమేజ్ ఉన్న మేము. లీడ్ రోల్ చేస్తే మోర్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఆ తరహాలోనే సినిమాలు చేస్తాను.
థియేటర్‌లో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఎంజాయ్ చేసి… పతాక సన్నివేశాలు చూసిన తరువాత ఓ మంచి ఎమోషన్‌తో.. కాసేపు అదే ఫీల్‌లో థియేటర్ నుంచి బయటికొస్తాడు.
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
Viral News : బాల్యవివాహాలను ఆపేందుకు ఎన్నో చట్టాలు ఉన్నా.. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అవి అమలవుతుండటం బాధాకరం.…
KCR : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్నారు. ఈ…
Mrunal Thakur Dhanush : టాలీవుడ్ మరియు బాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే... హీరో ధనుష్ , నటి…
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
This website uses cookies.