Premi vishwanath : వామ్మో.. అల్లు అర్జున్ ని డామినేట్ చేస్తున్న వంటలక్క
Premi vishwanath : స్టైలిష్ స్టార్ ఇప్పుడు ఐకాన్ స్టార్ గా పాపులర్ అయ్యాడు. పుష్ప సినిమా రిలీజ్ కాక ముందే స్టైలిష్ స్టార్ ఇమేజ్ ఐకాన్ స్టార్ గా మారడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఐకాన్ స్టార్ అంటే పాన్ ఇండియన్ స్టార్ అనే క్రేజ్ అనే భావనలో అభిమానులున్నారు. అంతగా అల్లు అర్జున్ తన క్రేజ్ ను అమాంతం పెంచేసుకుంటున్నాడు. ఈ సినిమాకు ముందు ఆయన నటించిన అల వైకుంఠపురములో సినిమా ఇండస్ట్రీ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికి ఈ సినిమాలోని సాంగ్స్ రికార్డ్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నాయి.

Premi vishwanath
అలాంటిదే మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వంటలక్క తాజాగా అల వైకుంఠపురములోని అల్లు అర్జున్ గెటప్ లో దర్శనమిచ్చి సెన్షేషన్ క్రియేట్ చేస్తోంది. అచ్చం ఆయన మాదిరిగానే గెటప్ వేసుకొని దిగిన ఫొటోలు అల్లు అర్జున్ అభిమానులనులతో పాటు వంటలక్క అభిమానులను అలరిస్తోంది. బుల్లితెర మీద వంటలక్కను ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అల వైకుంఠపురములోని ఒక్క గెటప్ తో ఆ క్రేజ్ కాస్త డబుల్ అయింది. ‘అల వైకుంఠపురములో’ సినిమాలో ‘సిత్తరాల సిరపడు’ అనే పాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే.
Premi vishwanath : డేవిడ్ వార్నర్ ని వంటలక్క డామినేట్ చేసిందంటున్నారు.

Premi vishwanath
క్లైమాక్స్ లో వచ్చే ఈ సీన్ లో అల్లు అర్జున్ చేతిలో కోడిపుంజు తలకు పాగా నోట్లో బీడీతో కనిపించి ఆకట్టుకున్నాడు. అదే పాటకు.. అదే గెటప్ లో వంటలక్క ( ప్రేమీ విశ్వనాథ్ ) కనిపించి ట్రెండ్ సెట్ చేస్తోంది. ఇది మా వంటలక్క లోని మరో మాస్ యాంగిల్ అంటూ అభిమానులు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ మధ్య అల్లు అర్జున్ అల సినిమాలోని బుట్ట బొమ్మ సాంగ్ కి ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్టెప్పులేసి ట్రెండింగ్ లో నిలిచాడు. ఇప్పుడు వంటలక్క ఆయనను డామినేట్ చేసిందంటున్నారు.