Sonu sood : సోనూసూద్ ఇంత మందికి సహాయం చేస్తున్నాడంటే వారి సపోర్ట్ వల్లే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sonu sood : సోనూసూద్ ఇంత మందికి సహాయం చేస్తున్నాడంటే వారి సపోర్ట్ వల్లే

Sonu sood : సోనూసూద్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రియల్ హీరో అయ్యాడు. సినిమాలలో మాత్రమే విలన్..రియల్ లైఫ్‌లో సోనూసూద్ లాంటి నిజాయితీ గల వ్యక్తి సమాజంలో చాలా తక్కువగా కనిపిస్తారు. ఆయన గత ఏడాది నుంచి ప్రజలకు చేస్తున్న సేవ అసాధారణం. ఆయన నుంచి ఇలాంటి స్పందన వస్తుందని గానీ..ఇంత సేవాగుణం ఆయనలో దాగి ఉందని గానీ ఇంతకాలం ఏ ఒక్కరికీ తెలియలేదు. గత ఏడాది కరోనా కారణంగా ఎంతో మంది ఎక్కడికక్కడే స్థంభించిపోయి గమ్యస్థానాలకు […]

 Authored By govind | The Telugu News | Updated on :27 May 2021,5:12 pm

Sonu sood : సోనూసూద్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రియల్ హీరో అయ్యాడు. సినిమాలలో మాత్రమే విలన్..రియల్ లైఫ్‌లో సోనూసూద్ లాంటి నిజాయితీ గల వ్యక్తి సమాజంలో చాలా తక్కువగా కనిపిస్తారు. ఆయన గత ఏడాది నుంచి ప్రజలకు చేస్తున్న సేవ అసాధారణం. ఆయన నుంచి ఇలాంటి స్పందన వస్తుందని గానీ..ఇంత సేవాగుణం ఆయనలో దాగి ఉందని గానీ ఇంతకాలం ఏ ఒక్కరికీ తెలియలేదు. గత ఏడాది కరోనా కారణంగా ఎంతో మంది ఎక్కడికక్కడే స్థంభించిపోయి గమ్యస్థానాలకు చేరుకోలేక అల్లాడిపోయారు. వారందరిని బస్సులలో..ట్రైన్స్‌లో .. ఇతర వాహనాలలో తమ ఇళ్ళకి చేర్చాడు.

sonu sood this much of money where from he getting

sonu sood-this much of money where from he getting

ఈ మధ్యలో ఉపాది కోల్పోయిన వారికి ఉపాది కల్పించాడు. తను ఇన్నాళ్ళు సినిమాల ద్వారా  పాదించిన డబ్బంతా పేదవారి సహాయానికి అందించాడు. రోగులకి ఆసుపత్రి బిల్లులు చెల్లించాడు. ఇప్పుడు ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేశాడు. ఇలా ఆయన శక్తికి మించిన సహాయాన్ని ప్రజలకు అందిస్తుంటే కొందరు మాత్రం సినిమాలలో విలన్ వేశాలు వేసుకునే ఒక సాధారణ నటుడికి ఇంత డబ్బు ఎక్కడిది..ఎలా ఇంతగా సహాయం చేగలుగుతున్నాడు. ఈయన వెనక ఏ రాజకీయా పార్టీ ఉంది..ఏ నాయకుడు సపోర్ట్ చేస్తున్నారు.

Sonu sood : సోనూసూద్‌పై కలిగిన అపోహలు ..అనుమానాలు తొలగిపోయాయట.

ఇలా ఎన్నో అనుమానాలు..సందేహాలు కలుగుతున్నాయట. ఇది సోషల్ మీడియాలోనూ విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అయితే సోనూసూద్ తను సంపాదించిన డబ్బుతో పాటు తనకు  స‌హాయపడుతున్న వాళ్ల ద్వారానే ఇదంతా చేయగలుగుతున్నాడట. తను చేస్తున్న ఈ మంచి పనికి ఎంతో మంది సపోర్ట్ చేస్తున్నారని, వారంతా తనకు నిధులు సమకూర్చుతున్నారని ..అలా పోగవుతున్న డబ్బునే ప్రజల కోసం ఉపయోగిస్తున్నాని తాజాగా సోనూసూద్ వెల్లడించాడు. దాంతో కొందరిలో కలిగిన అపోహలు ..అనుమానాలు తొలగిపోయాయట.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది