Chiranjeevi : పది కోట్ల విలువ గల ఆక్సిజన్ బ్యాంక్.. దటీజ్ మెగాస్టార్
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ హీరోనే. ప్రజలంతా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఇంట్లో ఉంటూ వంటలు వండుకుంటున్నాడని ఎగతాళి చేశారు. కానీ ఇప్పుడు చిరంజీవి తీసుకున్న నిర్ణయంతో అంతా షాక్ అవుతున్నారు. ప్రాణ వాయువు అందక ప్రాణాలు కోల్పోవడాన్ని దృష్టిలో పెట్టుకున్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ జిల్లాలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని ఫిక్స్ అయ్యారు.

Chiranjeevi
ఈ క్రమంలో గతవారం చిరంజీవి Chiranjeevi చారిటబుల్ ట్రస్ట్ ఓ ప్రకటన చేసింది. గతంలో రక్తం అందక, సరైన సమయంలో దొరక్క ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం చూసి బ్లండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆక్సిజన్ లేక ఇలాంటి పరిస్థితి నెలకొనడంతో ప్రతీ జిల్లాలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయబోతోన్నట్టు ప్రకటించారు. దానికి సంబంధించిన తాజా సమాచారం ఇప్పుడు బయటకు వచ్చింది.
దాదాపు పది కోట్ల విలువైన ఆక్సిజన్ బ్యాంక్‌లను ప్రతీ జిల్లాల్లో ఏర్పాటు చేసేందుకు రంగం సిద్దమైంది. ఈ మేరకు కార్యాచరణను చిరంజీవి Chiranjeevi దగ్గరుండి పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ వారం నుంచి ఇవి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ జిల్లా కేంద్రంలో లభ్యం కానున్నట్టు సమాచారం.