Priyamani : ప్రియ‌మ‌ణి న‌డుముపై చేయి వేసి అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన జాన్వీ తండ్రి..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Priyamani : ప్రియ‌మ‌ణి న‌డుముపై చేయి వేసి అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన జాన్వీ తండ్రి..!

Priyamani : మ‌ల‌యాళ ముద్దుగుమ్మ ప్రియ‌మ‌ణి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు స్టార్ స్టేట‌స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స‌పోర్టింగ్ రోల్స్ చేస్తూ సంద‌డి చేస్తుంది. ప్రియమణి తెలుగుతోపాటు తమిళంలోనూ మంచి పేరు సంపాదించుకుంది. అయితే ఈ మధ్య బాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీ అయిన ఈ భామ షారుక్ ఖాన్, అజయ్ దేవగన్ లాంటి టాప్ హీరోలతో కూడా ప‌ని చేసింది. మైదాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తొలిసారి చెన్నై ఎక్స్‌ప్రెస్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :11 April 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Priyamani : ప్రియ‌మ‌ణి న‌డుముపై చేయి వేసి అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన జాన్వీ తండ్రి..!

Priyamani : మ‌ల‌యాళ ముద్దుగుమ్మ ప్రియ‌మ‌ణి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు స్టార్ స్టేట‌స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స‌పోర్టింగ్ రోల్స్ చేస్తూ సంద‌డి చేస్తుంది. ప్రియమణి తెలుగుతోపాటు తమిళంలోనూ మంచి పేరు సంపాదించుకుంది. అయితే ఈ మధ్య బాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీ అయిన ఈ భామ షారుక్ ఖాన్, అజయ్ దేవగన్ లాంటి టాప్ హీరోలతో కూడా ప‌ని చేసింది. మైదాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తొలిసారి చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీలో షారుక్ ఖాన్ తో కలిసి ఓ స్పెషల్ పాటలో నటించిన ప్రియ‌మ‌ణి బాలీవుడ్‌లో ఆ తర్వాత జవాన్ లోనూ కనిపించింది. ఈ మధ్యే ఆర్టికల్ 370 మూవీలోనూ కూడా న‌టించి అల‌రించింది. మొత్తానికి సౌత్‌తో పాటు నార్త్‌లోను దుమ్ములేపుతుంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోను తెగ సంద‌డి చేస్తూ త‌న అంద‌చందాల‌తో ర‌క్తి క‌ట్టిస్తుంది.

Priyamani : అదేం ప‌న‌య్యా..!

ఇక ప్రియ‌మ‌ణి మైదాన్ మూవీపై చాలా హోప్స్ పెట్ట‌కుంది. ఇందులో అజ‌య్ దేవ‌గ‌ణ్ భార్య‌గా న‌టించింది.. ఉగాది కానుకగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్ర స్క్రీనింగ్ లో బాలీవుడ్ ప్ర‌ముఖులంతా హాజ‌రై సంద‌డి చేశారు. జాన్వీ కపూర్ తండ్రి.. బడా నిర్మాత బోనీ కపూర్ కూడా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరు కాగా, ఆయ‌న కూడా మైదాన్ మూవీ స్క్రీనింగ్ కి హాజరై ప్రియమణితో కలసి కెమెరాకి ఫోజులు ఇచ్చారు. అయితే ఫొటోల‌కి నార్మ‌ల్‌గా పోజులు ఇస్తే బాగానే ఉండేది. కాని ఆయన ప్రవర్తన నెటిజన్లకు అసలు నచ్చడం లేదు. బోని.. కెమెరాలకు ఫోజులు ఇచ్చే సమయంలో ప్రియమణి నడుము, భుజంని తడుముతూ కనిపించారు. భుజం పై చేతులు వేయడం పెద్ద తప్పేమి కాకపోవచ్చు. కానీ ఆయన నడుముపై చేయి వేయడంతో నెటిజన్లు మండిప‌డుతున్నారు.

Priyamani ప్రియ‌మ‌ణి న‌డుముపై చేయి వేసి అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన జాన్వీ తండ్రి

Priyamani : ప్రియ‌మ‌ణి న‌డుముపై చేయి వేసి అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన జాన్వీ తండ్రి..!

కూతురు వయసున్న నటితో అలానేనా ప్ర‌వ‌ర్తించేది అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. కెమెరాకు ఫోజులు ఇస్తూ పబ్లిక్ లో చీప్ గా బిహేవ్ చేస్తారా అంటూ బోనిని ఓ రేంజ్‌లో తిట్టిపోస్తున్నారు..బోని క‌పూర్.. ప్రియమణి భుజం పట్టుకుని అటు ఇటు జరుపుతూ పిచ్చిపిచ్చిగా ప్ర‌వ‌ర్తించ‌డం ప్ర‌తి ఒక్క‌రికి ఆగ్ర‌హాన్ని క‌లిగిస్తుంది. శ్రీదేవి మరణం తర్వాత తన కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ కెరీర్ బాధ్యతలని బోనీ కపూర్ మోస్తూ మంచి తండ్రిగా అనిపించుకుంటుండ‌గా, ఇప్పుడు ఆయ‌న చేసిన ఈ పని విమ‌ర్శ‌ల బారిన ప‌డేలా చేసింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది