Samantha : నా భ‌ర్త‌కు కూడా స‌మంత హాట్‌గా క‌నిపించిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రియ‌మ‌ణి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : నా భ‌ర్త‌కు కూడా స‌మంత హాట్‌గా క‌నిపించిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రియ‌మ‌ణి

 Authored By sandeep | The Telugu News | Updated on :31 January 2022,10:00 am

Samantha : ఒక‌ప్పుడు స్టార్ హీరోలు అంద‌రితో జ‌త‌క‌ట్టిన అందాల ముద్దుగుమ్మ ప్రియ‌మ‌ణి. ఈ అమ్మ‌డు ఇప్ప‌టికీ త‌న అంద‌చందాల‌తో అద‌ర‌గొడుతూనే ఉంది. ఒక‌వైపు సినిమాలు, మ‌రోవైపు టీవీ షోస్ చేస్తూ అల‌రిస్తుంది. ప్రస్తుతం ప్రియమణి ఆహాలో ప్రసారం కానున్న తెలుగు వెబ్ సిరీస్ ‘భామాకలాపం’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. “ది ఫ్యామిలీ మ్యాన్ 2″లో ప్రియమణి తన బలమైన పాత్రతో బాలీవుడ్ తో పాటు దక్షిణాదిలోనూ నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ బ్యూటీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటీమణులు మొత్తం సినిమాను తమ భుజాలపై మోయగలిగేలా కాలం మారిందని అభిపాయ పడింది.ఇండస్ట్రీలో ఇప్పుడు కాలం మారిందని, హీరోయిన్లకు మంచి ప్రాధాన్యత లభిస్తోందని చెప్పుకొచ్చింది.

అందుకు ఉదాహరణగా నయన్, సామ్ వంటి హీరోయిన్ల గురించి మాట్లాడింది. వారు హీరోల పక్కన గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసి ఎలా సక్సెస్ సాధిస్తున్నారో వివరించింది. స‌మంత రీసెంట్‌గా ఊ అంటావా పాట‌తో ఎంత సంచ‌ల‌నం రేపిందో మనం చూశాం. ఈ సాంగ్ లో సమంత హాట్ హాట్‌గా కనిపించిందని నాకే కాదు నా భర్తకు కూడా అనిపించింది. బహుశా సామ్ కెరీర్‌లో ఇలాంటివి చేసి ఉండకపోవచ్చు. ఈ పాటను చాలా మంది డౌన్‌లోడ్ చేసి, ఇప్పటికే రీల్స్‌ను తయారు చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఇది నంబర్ వన్ పాటగా నిలిచింది. ఇంత అద్భుతమైన పాటతో వచ్చినందుకు దేవి శ్రీ ప్రసాద్‌కి హ్యాట్సాఫ్. కొరియోగ్రఫీ చాలా అందంగా ఉంది” అంటూ సామ్ పై ప్రశంసల వర్షం కురిపించింది ప్రియమణి.

priyamani comments on samantha

priyamani comments on samantha

Samantha : స‌మంత టూ హాట్‌…

ఇప్పుడు హీరోయిన్లు చేసే అన్ని రకాల పాత్రలను పేక్షకులు కూడా అంగీకరిస్తున్నారని చెప్పుకొచ్చింది ఈ భామ. హీరోయిన్ అంటే గ్లామర్ గా, పొట్టి బట్టలు ధరించే రోజులు, పెద్ద హీరో సరసన రొమాంటిక్ లీడ్ మాత్రమే చేసే రోజులు పోయాయి. హీరోయిన్‌కి కూడా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఈ రోజుల్లో చాలా మంది హీరోయిన్లు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. ఉదాహరణకు సమంత ‘ఓ బేబీ’ చేసింది. నయనతార చాలా బాగా రాణిస్తోంది.ఆమె రజనీకాంత్, విజయ్ సరసన జత కట్టి, మరో పక్క నేత్రికన్, మాయ వంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌లలో కూడా నటిస్తోంది అంటూ ప్రియ‌మ‌ణి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది