Priyanka Jawalkar : టాలీవుడ్ హీరోయిన్‌తో ప్రేమాయ‌ణం న‌డుపుతున్న భార‌త క్రికెట‌ర్

Authored By Sam C | The Telugu News | Updated on : 4 April 2022, 6:30 pm

Priyanka Jawalkar : సాధార‌ణంగా క్రికెట‌ర్ల‌కు హీరోయిన్ ల‌కు ఓ ప్ర‌త్యేక‌మైన రిలేష‌న్ ఉంటుంది. క్రికెట‌ర్స్‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన హీరోయిన్స్‌ని చాలా మందిని చూశాం. అయితే కొంత‌మంది పెళ్లిళ్లు చేసుకుంటే మ‌రికొంద‌రు మ‌ధ్య‌లోనే విడిపోతారు. మ‌రోవైపు స్టార్ హీరోయిన్ లు కూడా క్రికెట‌ర్ ల‌కు ఎక్కువ‌గా అట్రాక్ట్ అవుతుంటారు. అయితే తాజాగా భార‌త క్రికెక‌ట‌ర్ ఒక‌రు హీరోయిన్ ఫోటోకు కామెంట్ చేసి నెట్టింట ట్రోల్స్ కు గుర‌వుతున్నాడు. ఆ క్రికెట‌ర్ మ‌రెవ‌రో కాదు వెంక‌టేష్ అయ్యర్.టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్లు చాలా తక్కువ. అలాంటి వారిలో తనకంటూ గుర్తింపు సంపాదించుకోవడానికి కష్టపడుతోంది ప్రియాంక జవాల్కర్. విజయ్ దేవరకొండలాంటి స్టార్ హీరో సరసన డెబ్యూ చేసినా..

ప్రియాంకకు వచ్చే ఆఫర్లు మాత్రం అంతంతమాత్రమే.సోషల్ మీడియాలో మాత్రం ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే ప్రియాంక.. ఈమధ్య ఓ క్రికెటర్ పోస్ట్‌కు కామెంట్ చేసి నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఉగాది సందర్భంగా ప్రియాంక తన ఫొటోలను షేర్‌ చేస్తూ ‘బూ’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రియాంక ఈ ఫొటోలో క్రీమ్‌ కలర్‌ షోల్డర్‌ కట్‌ టాప్‌ ధరించి కర్టన్‌ వెనకాల కుర్చోని ఉంది. ఈ ఫొటోకి వెంకటేశ్‌ అయ్యర్‌ క్యూట్‌ అంటూ కామెంట్‌ చేశాడు. అతడి కామెంట్‌కు ప్రియాంక హు? యూ? అంటూ రిప్లై ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.ఆయ‌న ఎవ‌రో నీకు తెలియ‌దా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

priyanka jawalkar love with Venkatesh Iyer

priyanka jawalkar love with Venkatesh Iyer

Priyanka Jawalkar : ఏం జ‌రుగుతుంది…

వెంక‌టేష్ అయ్య‌ర్ గ‌త ఐపీఎల్ లో స‌త్తా చాటి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. ఈసారి కూడా వెంక‌టేష్ అయ్య‌ర్ కోల్ క‌తా ఓపెన‌ర్ గా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాడు. ఈ క్ర‌మంలో భార‌త జ‌ట్టులో సుస్థిర‌మైన స్థానం సంపాదించేందుకు కృషి చేస్తున్నాడు. అయితే తాజాగా వెంక‌టేష్ అయ్య‌ర్ ఓ టాలీవుడ్ హీరోయ‌న్ ఫోటోకు కామెంట్ పెట్టి నెట్టింట ట్రోల్స్ కు గుర‌య్యాడు. ఏదేమైన ఈ ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చని చూస్తుంటే చూస్తుంటే వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లున్నారని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. కాగా ప్రియాంకా జవాల్కర్‌ విజయ్‌ దేవరకొండతో టాక్సివాలా మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం, తిమ్మరుసు వంటి చిత్రాల్లో నటించింది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి