priyanka singh Bigg Boss contestant got film offer
Priyanka Singh : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ కొందరు ఆ తర్వాత కాలంలో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలు సంపాదించుకున్నారు. తమ పాపులారిటీని ఇంకా పెంచేసుకుని హ్యాపీగా ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో ప్రియాంక సింగ్ కూడా చేరిపోయింది. తాజాగా ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేసింది.తెలుగు బుల్లితెర పాపులర్ కామెడీ షో ‘జబర్దస్త్’ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమైన సాయితేజ్ కాదు కాదు.. ప్రియాంక సింగ్.. ఆ తర్వాత కాలంలో ‘బిగ్ బాస్’లో పార్టిసిపేట్ చేసిన సంగతి అందరికీ విదితమే. లింగ మార్పిడి అనంతరం సాయితేజ్.. ప్రియాంక సింగ్‌గా మారిపోయింది.
ఇకపోతే ‘బిగ్ బాస్’లోనూ ప్రియాంక సింగ్ 12 వారాల పాటు కొనసాగింది. ఈ క్రమంలోనే తన పాపులారిటీని ఇంకా పెంచేసుకుంది కూడా. కాగా, తాజాగా వెండితెరపైన అవకాశాన్ని దక్కించుకుంది ప్రియాంక సింగ్.టాలీవుడ్ ఫేమస్ ప్రొడ్యూసర్, రైటర్ కోన వెంకట్ తన సినిమాలో అవకాశం ఇచ్చినట్లు ప్రియాంక సింగ్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. కోన వెంకట్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన ప్రియాంక సింగ్.. తనకు వచ్చిన అవకాశంతో చాలా ఆనందంగా పడుతున్నానని, ఎగ్జైటింగ్‌గా ఉందని తెలిపింది ప్రియాంక సింగ్. అయితే, సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా తెలపలేదు.
priyanka singh Bigg Boss contestant got film offer
కానీ, అఫీషియల్‌గా తాను ఓ ప్రాజెక్టులో కోన వెంకట్ తో అసోసియేట్ అవుతున్నట్లు అయితే ప్రియాంక సింగ్ చెప్పింది. త్వరలోనే ఒక బెస్ట్ ఎంటర్ టైన్మెంట్‌తో రాబోతున్నామని పేర్కొంది ప్రియాంక. ఇకపోతే ప్రియాంక సింగ్ చేసిన ట్వీట్ చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంక సింగ్‌కు కంగ్రాట్స్ చెప్తున్నారు కొందరు నెటిజన్లు. మరి కొందరు నెటిజన్లు అయితే, వెండితెరపైన కూడా ప్రియాంక సింగ్ అదరగొడుతుందని అంటున్నారు. అందుకుగాను ఆల్ ది బెస్ట్ అంటూ విష్ చేస్తున్నారు.
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
This website uses cookies.