Modi : వరుసగా మూడవ సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఎన్డీయే కూటమి ప్రయత్నాలు చేస్తోంది. మూడవ సారి మోడీ ప్రధాని అవుతారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో దేశ వ్యాప్తంగా విపక్షాలను ఏకం చేసేందుకు ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ ప్రయత్నాలు చేయాలి. కాని ఆ పనిని రాజకీయ వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ మొదలు పెట్టాడు. కాంగ్రెస్ తో కలిసి ఆ పని చేయాలనుకున్న ప్రశాంత్ కిషోర్ కు అక్కడ స్పేస్ దక్కలేదు. ఆయన అనుకున్నట్లుగా అక్కడ పరిస్థితులు లేక పోవడంతో చేసేది లేక కాంగ్రెస్ ను వదిలేసి దూరంగా ఆ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది.
తాజాగా ఆయన మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడం కష్టమైన పని కాదు. త్వరలో జరుగబోతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉండక పోవచ్చు. కాని రాబోయే కేంద్ర ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా ప్రతిపక్షాలకు అనుకూలంగా వస్తాయనే నమ్మకంను వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న పార్టీతో మోడీ ప్రభుత్వంను కూల్చడం సాధ్యం కాకపోవచ్చు. కాని విపక్ష పార్టీలు అన్ని కలిసి ముందుకు వస్తే తప్పకుండా ఒక బలమైన ప్రతిపక్ష పార్టీగా మారే అవకాశం ఉందని ఆయన అన్నాడు. ఇప్పటికే బీజేపీ వ్యతిరేక విధానాలు మరియు వారి పాలసీలు ప్రభుత్వంపై జనాల్లో విమర్శల పాలు అయ్యేలా చేశాయి. కనుక ప్రతి ఒక్క పార్టీ కూడా ఈ సమయంలో సరైన వ్యూహంతో ముందుకు వెళ్తే మోడీని గద్దె దించడం అసాధ్యం కాదని ఆయన అంటున్నాడు.
కాంగ్రెస్ ను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందని.. వారి ప్రక్షాళణ తోనే దేశంలో బీజేపీ ప్రభుత్వం గద్దె దిగే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే ఆ ప్రక్షాళనకు కాంగ్రెస్ సిద్దంగా ఉందా అంటూ ఆయన ప్రశ్నించాడు. బీజేపీ హిందుత్వ వాదం మరియు సంక్షేమ పథకాలతో బీజేపీ ఎన్నికల్లోకి వెళ్లబోతుంది. కనుక వాటిని అధిగమించేలా విపక్ష పార్టీలు అన్ని కలిసి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తీసుకు వెళ్లాలి అన్నట్లుగా ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చాడు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా రాబోయే పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఉంటాయనే నమ్మకంను ఆయన వ్యక్తం చేశాడు. మరి ప్రశాంత్ కిషోర్ అంచనా ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.