Priyanka Singh : వెండితెరపై ప్రియాంక సింగ్.. బిగ్ న్యూస్ చెప్పేసిన మరో బిగ్ బాస్ కంటెస్టెంట్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Priyanka Singh : వెండితెరపై ప్రియాంక సింగ్.. బిగ్ న్యూస్ చెప్పేసిన మరో బిగ్ బాస్ కంటెస్టెంట్..

Priyanka Singh : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ కొందరు ఆ తర్వాత కాలంలో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలు సంపాదించుకున్నారు. తమ పాపులారిటీని ఇంకా పెంచేసుకుని హ్యాపీగా ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో ప్రియాంక సింగ్ కూడా చేరిపోయింది. తాజాగా ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేసింది.తెలుగు బుల్లితెర పాపులర్ కామెడీ షో ‘జబర్దస్త్’ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమైన సాయితేజ్ కాదు కాదు.. ప్రియాంక సింగ్.. […]

 Authored By mallesh | The Telugu News | Updated on :25 January 2022,7:00 pm

Priyanka Singh : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ కొందరు ఆ తర్వాత కాలంలో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలు సంపాదించుకున్నారు. తమ పాపులారిటీని ఇంకా పెంచేసుకుని హ్యాపీగా ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో ప్రియాంక సింగ్ కూడా చేరిపోయింది. తాజాగా ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేసింది.తెలుగు బుల్లితెర పాపులర్ కామెడీ షో ‘జబర్దస్త్’ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమైన సాయితేజ్ కాదు కాదు.. ప్రియాంక సింగ్.. ఆ తర్వాత కాలంలో ‘బిగ్ బాస్’లో పార్టిసిపేట్ చేసిన సంగతి అందరికీ విదితమే. లింగ మార్పిడి అనంతరం సాయితేజ్.. ప్రియాంక సింగ్‌గా మారిపోయింది.

ఇకపోతే ‘బిగ్ బాస్’లోనూ ప్రియాంక సింగ్ 12 వారాల పాటు కొనసాగింది. ఈ క్రమంలోనే తన పాపులారిటీని ఇంకా పెంచేసుకుంది కూడా. కాగా, తాజాగా వెండితెరపైన అవకాశాన్ని దక్కించుకుంది ప్రియాంక సింగ్.టాలీవుడ్ ఫేమస్ ప్రొడ్యూసర్, రైటర్ కోన వెంకట్ తన సినిమాలో అవకాశం ఇచ్చినట్లు ప్రియాంక సింగ్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. కోన వెంకట్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన ప్రియాంక సింగ్.. తనకు వచ్చిన అవకాశంతో చాలా ఆనందంగా పడుతున్నానని, ఎగ్జైటింగ్‌గా ఉందని తెలిపింది ప్రియాంక సింగ్. అయితే, సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా తెలపలేదు.

priyanka singh Bigg Boss contestant got film offer

priyanka singh Bigg Boss contestant got film offer

Priyanka Singh : చాలా ఎగ్జైటింగ్‌గా ఉందంటున్న ప్రియాంక సింగ్..

కానీ, అఫీషియల్‌గా తాను ఓ ప్రాజెక్టులో కోన వెంకట్ తో అసోసియేట్ అవుతున్నట్లు అయితే ప్రియాంక సింగ్ చెప్పింది. త్వరలోనే ఒక బెస్ట్ ఎంటర్ టైన్మెంట్‌తో రాబోతున్నామని పేర్కొంది ప్రియాంక. ఇకపోతే ప్రియాంక సింగ్ చేసిన ట్వీట్ చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంక సింగ్‌కు కంగ్రాట్స్ చెప్తున్నారు కొందరు నెటిజన్లు. మరి కొందరు నెటిజన్లు అయితే, వెండితెరపైన కూడా ప్రియాంక సింగ్ అదరగొడుతుందని అంటున్నారు. అందుకుగాను ఆల్ ది బెస్ట్ అంటూ విష్ చేస్తున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది