Home » Entertainment » Navya Swamy Satires On Anchor Suma In Cash Show
Entertainment

Navya Swamy : ఇప్పటి వరకు చేసింది చాలు!.. సుమపై పంచ్ వేసిన నవ్యస్వామి

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: January 25, 2022, 7:50 pm
Advertisement

Navya Swamy : బుల్లితెరపై సుమ చేసే షోలు ఎంత సందడిగా ఉంటాయో అందరికీ తెలిసిందే. సుమ షో అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. అలా సుమ చేసే క్యాష్ షో, అందులో వచ్చే గెస్టుల మీద వేసే పంచ్‌లు మామూలుగా వైరల్ అవ్వవు. ఇక ఈ మధ్య అయితే షోలో రొమాన్స్‌ను కూడా జోడిస్తున్నారు. ట్రెండింగ్ పెయిర్‌ను తీసుకొచ్చి మరీ దుమ్ములేపుతున్నారు.

Advertisement

అలా క్యాష్ షోలో రవికృష్ణ నవ్యస్వామి చేసిన రొమాన్స్‌కు అందరూ ఫిదా అయ్యారు. గతంలో ఓ సారి నవ్యస్వామి రవికృష్ణలు సుమ క్యాష్ షోలో సందడి చేశారు. ఆసమయంలో ఈ ఇద్దరూ బాగా ట్రెండింగ్‌లో ఉండేవారు. ఈ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందనే రూమర్లు గుప్పుమన్నాయి. అయితే ఆ సమయంలో ఆ ఇద్దరితో సుమ రొమాంటిక్ స్కిట్లు కూడా వేయించింది.

Navya Swamy Satires On Anchor Suma In Cash Show

Advertisement

Navya Swamy : సుమపై నవ్యస్వామి కౌంటర్లు..

ఇక మరోసారి ఆ ఇద్దరిని తన షోకు పిలిచింది సుమ. ఈ వారం రాబోయే షోలో సిద్దు విష్ణుప్రియ (రియల్ కపుల్) నవ్యస్వామి రవికృష్ణ (రీల్ కపుల్)లు సందడి చేశారు. సిద్దు విష్ణుప్రియలు ముద్దలతో రెచ్చిపోయారు. గడ్డం ఉన్న అబ్బాయిలు అంటే ఇష్టమా? లేన అబ్బాయిలు అంటే ఇష్టమా? అని సుమ అడుగుతుంది. గడ్డం ఉన్న అబ్బాయిలే ఇష్టమని నవ్యస్వామి చెబితే.. దాన్ని రీ ప్లే వేసి మరీ చూపిస్తుంది. ఇప్పటికే చేసింది చాలు అని సుమ మీద నవ్యస్వామి కౌంటర్లు వేస్తుంది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి