Rashmi Gautam : వాళ్ల పేర్లు చెప్పి ర‌ష్మీ గౌత‌మ్ బెదిరించింది.. గేటుకు క‌ట్టేసి కొడ‌తా అన్నాను…

Authored By Sam C | The Telugu News | Published on: March 15, 2022, 2:00 pm

Rashmi Gautam : బుల్లితెర యాంకర్స్‌లో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది ర‌ష్మీ గౌత‌మ్. ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో చేసే ర‌చ్చ మాములుగా ఉండ‌దు. ఇటీవ‌లి కాలంలో ర‌ష్మీ త‌న అందాలు ఆర‌బోస్తూ తెగ ర‌చ్చ చేస్తుంది. బుల్లితెరపైనే కాక వెండితెర‌పై కూడా ర‌ష్మీ సంద‌డి చేస్తుంటుంది. అయితే ఓ సినిమా విషయంలో రష్మీ తనని ఇబ్బంది పెట్టిందని టాలీవుడ్ సీనియర్ నిర్మాత బాలాజీ నాగలింగం అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. రష్మీని తాను బెదిరించినట్లుగా వెల్లడించారు. అయితే అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఈ సందర్భంగా తెలిపారు.’రాణి గారి బంగ్లా’ అనే సినిమా చేయడానికి ర‌ష్మీ ఓకే చెప్పిందని అన్నారు నాగ లింగం.

షూటింగ్‌‌లో ఓ సాంగ్, డబ్బింగ్‌‌కి వచ్చేసరికి చేయను అంటూ ఇబ్బంది పెట్టిందని, హీరోని మార్చాలంటూ డిమాండ్ చేసిందని తెలిపారు. ఇదే విషయం పైన ఆమె ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే.. తనకి నాగబాబు తెలుసు, మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలుసునని చెప్పి బెదిరించిందని తెలిపారు. అంటే నాగ‌బాబుగారు నాకు తెలియ‌దా.. శ్యాం ప్ర‌సాద్ రెడ్డిగారు తెలియ‌దా. నేను భూమి పుట్టిన‌ప్పుడు పుట్టినోడిని. ఇండ‌స్ట్రీలో నుంచే వ‌చ్చాను. ర‌ష్మీ నాతో మాట్లాడిన మాట‌లు రికార్డింగ్ కూడా నాద‌గ్గ‌ర ఉంది. అప్పుడు నేను త‌నను ఫిల్మ్ ఛాంబ‌ర్ గేటుకు క‌ట్టేసి కొడ‌తాన‌ని అన్నాను అని నాగ లింగం పేర్కొన్నారు.

producer comments on Rashmi Gautam

producer comments on Rashmi Gautam

Rashmi Gautam : ర‌ష్మీపై అలాంటి ఆరోప‌ణ‌లా?

ఇదంతా ఆమె కావ‌ల‌నే చేసింద‌ని ఆయ‌న అంటున్నారు. ఇదిలా ఉంటే ర‌ష్మీ గౌత‌మ్ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియాలో మూగ జీవాల పట్ల స్పందించే విధానానికి ఎంతో మంది అభిమానులున్నారు. రష్మీ గౌతమ్ జంతు ప్రేమికురాలు. వీధి కుక్కలపై రష్మీ ప్రత్యేక శ్రద్దను కనబరుస్తుంటుంది. జంతువులను హింసించే, బలి ఇచ్చే ఆచారాల మీద రష్మీ గౌతమ్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటుంది. జీవ హింసకు వ్యతిరేకంగా పోరాడుతుంటుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp