Producer Gave Advances To Pawan Kalyan Without Confirming His Dates
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసేందుకు ఆయనకు అడ్వాన్స్ లు ఇచ్చిన దర్శక నిర్మాతలు అనుకుంటున్నా మాట బుద్ధి తక్కువ అయింది.. పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయాలని ఆశపడి కోట్లల్లో అడ్వాన్స్ లు ఇచ్చిన నిర్మాతలు ఇప్పుడు నెత్తిన గుడ్డ అన్నట్లుగా పరిస్థితి మారి పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క దర్శకుడు రెండు మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు, అయినా కూడా ఎప్పుడు ఆయన డేట్ లు ఇస్తాడా తెలియడం లేదు. ఒకవైపు జనసేనని బస్సు యాత్రకి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో వైపు రెండు మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఒక్కొక్క నిర్మాత పదుల కోట్లలో అడ్వాన్స్ ను ఇచ్చి ఉన్నారు.
ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ తీరును వారు బాహాటంగా విమర్శించలేక పోతున్నారు. అలా అని కడుపులో దాచుకోలేక పోతున్నారు. సన్నిహితుల వద్ద వాపోతున్నట్లుగా సమాచారం అందుతుంది. పవన్ కళ్యాణ్ కి బుద్ధి తక్కువ అడ్వాన్స్ ఇచ్చి ఇరుక్కు పోయాము. ఇంకోసారి ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ తో పెట్టుకోము అంటూ వారు సన్నిహితుల వద్ద రహస్యంగా చెబుతున్నారట. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. ముగ్గురు నలుగురు నిర్మాతలు మరియు దర్శకుల పరిస్థితి ఇలాగే ఉంది. నిర్మాతలు పదుల కోట్లలో అడ్వాన్స్ ఇచ్చి పవన్ కళ్యాణ్ ఎప్పుడు డేట్ లు ఇస్తే అప్పుడు సినిమాను మొదలు పెట్టాలని ఎదురు చూస్తున్నారు. దర్శకులు కూడా కథలు చెప్పి వాటికి స్క్రిప్ట్ రెడీ చేసి పవన్ కళ్యాణ్ డేట్ ల కోసం ఎదురు చూస్తున్నారు.
Producer Gave Advances To Pawan Kalyan Without Confirming His Dates
ఇలా పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూడటం వల్ల దర్శక నిర్మాతల సమయం చాలా వృధా అవుతుంది.. ఒక దర్శకుడు లేదా నిర్మాత సంవత్సరంలో చాలా ఎంటర్టైన్మెంట్ ను ప్రేక్షకులకు అందించే అవకాశం ఉంటుంది, కానీ పవన్ కళ్యాణ్ వద్ద వారు ఇరుక్కు పోవడం వల్ల ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వడం మాత్రమే కాకుండా వారు తీవ్రంగా ఆర్థిక పరమైన నష్టాలను చూడాల్సి వస్తుందంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి ఇప్పటికే అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలు కాకుండా ఇంకా ముందు ముందు ఎవరు అడ్వాన్సులు ఇచ్చే పరిస్థితి కనపడటం లేదు. ఎందుకంటే ప్రస్తుతం తీసుకున్న అడ్వాన్స్ లకు మూడు నాలుగు సంవత్సరాలు కంటిన్యూగా సినిమా షూటింగ్ లు చేసిన కూడా పవన్ కళ్యాణ్ వాటిని పూర్తి చేసే పరిస్థితి లేదు. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.