Home » Entertainment » Producers Strike Tollywood Split In Two Due To Dil Raju
Entertainment

Dil Raju : నిర్మాతల సమ్మె.. దిల్‌ రాజు వల్ల రెండుగా చీలిన టాలీవుడ్‌

Authored By
aruna
The Telugu News | Published on: August 4, 2022, 7:40 pm
Advertisement

Dil Raju : టాలీవుడ్ నిర్మాతలు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. షూటింగ్ లు పూర్తిగా నిలిపి వేసి తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు మళ్లీ షూటింగు లు చేయం అని అంటూ నిర్మాతల గిల్డ్ అధికారికంగా ప్రకటించి ఆగస్టు ఒకటి నుండి సమ్మె చేస్తున్నారు. సమ్మె జరుగుతుంది అని అధికారికంగా ప్రకటన వచ్చినా కూడా చాలా సినిమాల షూటింగులు ఏదో ఒక కారణాలు చెప్పి చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా దిల్ రాజు కు సంబంధించిన సినిమాలు మరియు సితార ఎంటర్టైన్మెంట్ సినిమాలు మరికొన్ని సినిమాలు షూటింగ్ లు జరుగుతున్నాయి.

Advertisement

ఈ నేపథ్యంలో తాము సినిమా షూటింగ్ లను నిలిపివేస్తే మీరు ఎందుకు చేస్తున్నారంటూ కొందరు నిర్మాతలు దిల్ రాజు మరియు ఇతర నిర్మాతలపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ వ్యవహారంలో తాము ఎందుకు బలి పశువు కావాలా అంటూ కొందరు నిర్మాతలు ఆగ్రహంతో ఊగి పోతున్నారు. లక్షలు కోట్ల రూపాయలను నష్టపోతూ మేము షూటింగ్ లు నిలిపి వేస్తే ఇతర నిర్మాతలు కొంత మంది షూటింగ్ చేయడం ఏంటి అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. తాము కూడా సోమవారం నుండి షూటింగ్ చేసుకోబోతున్నట్లు ఆ నిర్మాతలు ప్రకటించారు. ఈ విషయంలో దిల్ రాజు పై చాలా మంది నిర్మాతలు సంతృప్తిగా లేరని తెలుస్తోంది.

Producers strike Tollywood split in two due to Dil Raju

Advertisement

ఈ మొత్తం వ్యవహారంలో దిల్ రాజు తో పాటు టాలీవుడ్ కు చెందిన కొందరు బడా నిర్మాతలు వ్యవహరిస్తున్న తీరు పట్ల మొత్తం టాలీవుడ్ నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నారు. దాంతో టాలీవుడ్ నిర్మాతల సంఘం రెండుగా చీలినట్లు అయ్యింది. ఇప్పటికే నిర్మాతల మండలి నుండి యాక్టివ్ నిర్మాతల మండలి ఒకటి ఏర్పడింది, ఇప్పుడు ఈ యాక్టివ్ నిర్మాతల మండలి కూడా రెండుగా చీలడం తో ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే విషయమై ఆసక్తికర పరిణామం నెలకొంది. ఇంతకూ టాలీవుడ్ నిర్మాతల సమ్మె కొనసాగుతుందా లేదా అనేది మరో మూడు నాలుగు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి