Relationship between Sridevi and comedian Rajababu..
Sridevi : సినీ ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు, కృష్ణ టైమ్ లో కమెడియన్స్ చాలా తక్కవగా ఉండేవారు.. కానీ.. ఉన్నవాళ్లు అద్బుతమైన నటనతో ఆకట్టుకునేవారు.. అలాగే కమెడియన్లు కూడా అప్పట్లో హీరోలుగా చేసి ఆకట్టుకునేవారు. ఇక ఆ రోజుల్లో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజబాబు. బక్కపలుచని శరీరంతో కనిపిస్తూ రాజబాబు అందర్నీ నవ్వించేవాడు. అప్పట్లోనే రాజబాబు హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకునేవాడట. ఇక స్టార్ హీరోలు అందరితోనూ నటించిన రాజబాబు హీరోగా కూడా సినిమాలు చేశాడు.
రాజబాబు విజయ నిర్మల, వాణిశ్రీ లాంటి హీరోయిన్ ల పక్కన హీరోగా అదరగొట్టాడు. అంతే కాకుండా అతిలోక సుందరి శ్రీదేవితో కూడా రాజబాబు సినిమాలో నటించడం గమనర్హం. అయితే శ్రీదేవి అప్పుడప్పుడే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటున్న సమయంలో నటించింది. 1975 లో కృష్ణ – మంజుల హీరో, హీరోయిన్ లుగా నటించిన దేవుడులాంటి మనుషులు సినిమాలో రాజబాబుకు జోడీగా శ్రీదేవి నటించింది. ఈ సినిమాలో రాజబాబు శ్రీదేవి మధ్య ఓ సాంగ్ కూడా ఉంటుంది. మరో విశేషం ఏంటంటే శ్రీదేవి కెరీర్ లో ఇదే మొదటి డ్యూయోట్.
Relationship between Sridevi and comedian Rajababu..అలా లెజెండరీ కమెడియన్ రాజబాబుతో మొదటి డ్యూయెట్ చేసే అదృష్టాన్ని శ్రీదేవి దక్కించుకుంటే.. అతిలోక సుందరితో డ్యూయెట్ చేసే అదృష్టం కమెడియన్ రాజబాబుకు దక్కింది.ఆ తర్వాత శ్రీదేవికి వరుస హిట్లు రావడంతో తన కెరీర్ లో స్టార్ హీరోలకు సైతం డేట్లు ఇవ్వలేనంతగా బిజీ అయిపోయింది. స్టార్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్లు అందుకోవడమే కాకుండా… ఎంతటి హీరో అయినా తాను నటించాలంటే కండిషన్స్ పెట్టే స్థాయికి ఎదిగింది. ఇక ప్రేక్షులకు వినోదాన్ని పంచిన రాజబాబు.. శ్రీదేవి ఇద్దరూ ఈ లోకంలో లేకపోవడం దురదృష్టం.
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
This website uses cookies.