Pulsar Bike Jhansi : రెచ్చిపోయి చిందులేసిన ప‌ల్స‌ర్ బైక్ ఝాన్సీ.. చ‌క్క‌ర్లు కొడుతున్న వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pulsar Bike Jhansi : రెచ్చిపోయి చిందులేసిన ప‌ల్స‌ర్ బైక్ ఝాన్సీ.. చ‌క్క‌ర్లు కొడుతున్న వీడియో

 Authored By sandeep | The Telugu News | Updated on :20 October 2022,7:30 pm

Pulsar Bike Jhansi : శ్రీదేవి డ్రామా కంపెనీ షోతో చాలా మంది టాలెంట్ బ‌య‌ట‌కు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అలా ఈవెంట్స్ లో డాన్స్ ప్రోగ్రామ్స్ చేసే ఝాన్సీ పాపుల‌ర్ అయింది. ప్రైవేట్ సాంగ్ కి ఝాన్సీ వేసిన మాస్ స్టెప్స్ పిచ్చి రేపాయి. షోలో ఉన్న కమెడియన్స్ తో పాటు ఆడియన్స్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశారు. డాన్స్ లో ఝాన్సీ యూనిక్ స్టైల్ జనాలకు కనెక్ట్ అయ్యింది. ఆ దెబ్బతో ఝాన్సీ మరింత పాపులర్ అయ్యారు. డ్యాన్స్ పూర్త‌య్యాక ఝాన్సీ తనను తాను గాజువాక డిపో కండక్టర్ గా పరిచయం చేసుకున్నారు. ఇది ప్రేక్షకులను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది.

తనకు డాన్స్ అంటే ఇష్టమని అయితే బంధువులతో పాటు కొందరు ఈ వృత్తిని ఎంచుకున్నందుకు అవమానించారని, మా పరువు తీస్తున్నావని తిట్టిపోశారని ఝాన్సీ తెలియజేసింది. రమేష్ మాస్టర్ అనే వ్యక్తి ఝాన్సీని ప్రోత్సహించారు. ఝాన్సీతో పాటు ఓ టీమ్ ని ఏర్పాటు చేసి ప్రోగ్రామ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఝాన్సీ డాన్స్ వీడియోలు యూట్యూబ్ లో లక్షలు మంది చూశేవారు. ఆ విధంగా ఆమె సోషల్ మీడియా సెలబ్రిటీ అయ్యారు. ప్రస్తుతం ఝాన్సీ టెలివిజన్ షోస్ లో కూడా కనిపిస్తున్నారు. అయితే సోష‌ల్ మీడియా ద్వారా కూడా ఝాన్సీ అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంది. తాజాగా ఈమె మంగ్లీ పాడిన పాట‌కు త‌న‌దైన స్టైల్‌లో డ్యాన్స్ వేసింది. ఇందులో ఆమె స్టెప్పులు కుర్రాళ్ల‌కి పిచ్చెక్కిస్తున్నాయి.

Pulsar Bike Jhansi Dance video viral

Pulsar Bike Jhansi Dance video viral

Pulsar Bike Jhansi : చింపేసింది..

ఎంత గ్రేస్‌తో డ్యాన్స్ చేస్తున్నావు అని కొంద‌రు కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌స్తుతం ఝాన్సీ డ్యాన్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. శ్రీదేవి డ్రామా కంపెనీలో ‘పల్సర్ బైక్’ సాంగ్‌తో స్టేజ్‌కి షేక్ ఆడించిన ఝాన్సీ.. తన మల్టీటాలెంట్‌తో హాట్ టాపిక్ అవుతోంది. ఓ వైపు కండక్టర్‌గా మరోవైపు డాన్సర్‌గా బతుకుసాగిస్తున్న ఝాన్సీ.. గత 11 ఏళ్లుగా ఏపీఎస్ఆర్టీసీ గాజువాక డిపోలో ఉద్యోగబాధ్యతలు నిర్వర్తిస్తూ.. డాన్స్ పెర్ఫామెన్స్‌లు చేస్తూ ఉంటుంది. ఓ వైపు పేదరికం.. మరో వైపు ఇంటి బాధ్యతలతో ఉద్యోగాన్ని చేస్తూనే తనకి ఎంతో ఇష్టమైన డాన్స్‌ని చేస్తూ వస్తోంది. ఉత్తరాంధ్రలో డాన్సర్ ఝాన్సీ చాలామంది పరిచయమే కాగా.. గతంలో టీవీ షోలు కూడా చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Asi Jhansi (@pulsar_bike_jhansi)

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది