Pulsar Bike Jhansi : పల్సర్‌ బండి ఝాన్సీ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా.. లక్‌ అంటే నిజంగా ఈమెదే

 Authored By prabhas | The Telugu News | Updated on :25 January 2023,10:00 pm

Pulsar Bike Jhansi : ఏపీఎస్ ఆర్టీసీ బస్ కండక్టర్ గా విధులు నిర్వహిస్తూనే స్టేజ్ షోలు చేస్తున్న డాన్సర్ ఝాన్సీ కి శ్రీదేవి డ్రామా కంపెనీలో పల్సర్ బండి పాటకు డాన్స్ చేసే అవకాశం వచ్చింది. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఝాన్సీ యొక్క పల్సర్ బండి పాట డాన్స్ చూసి అంత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అప్పటి నుండి పల్సర్ బండి ఝాన్సీ అయ్యింది. సోషల్ మీడియాలో ఝాన్సీ క్రేజ్ అమౌంట్ పెరిగి పోయింది. ఆ మధ్య వరుసగా జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సందడి చేసిన ఝాన్సీ ఇప్పుడు కనిపించడం లేదు.

అయ్యో పాపం మళ్ళీ బస్సు కండక్టర్ గా ఝాన్సీ విధులు నిర్వహిస్తుందా.. అవకాశాలు అంతలోనే కనిపించకుండా పోయాయి.. క్రేజ్ తగ్గి పోయిందా అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే ఝాన్సీ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది. ఒక వైపు జాబ్ చేస్తూనే మరో వైపు ఆమె ప్రైవేట్ ఆల్బమ్స్ లో నటిస్తోంది. గత కొన్ని రోజులుగా వరుసగా ఆమె ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూనే ఉంది. శ్రీదేవి డ్రామా కంపెనీ తో గుర్తింపు వచ్చిన తర్వాత ఏకంగా 10 ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ లో ఈమె నటించిందట.

where is Sridevi drama company Pulsar Bike Jhansi

where is Sridevi drama company Pulsar Bike Jhansi

అంతే కాకుండా గతంలో చేసినట్లు స్టేజ్‌ పెర్ఫార్మెన్స్ కూడా పల్సర్ బండి ఝాన్సీ చేస్తుంది. గతంలో ఉన్న రెమ్యూనరేషన్ కి ఇప్పటి రెమ్యూనరేషన్ కి 100 రెట్ల తేడా ఉంది అంటూ ఆమె సన్నిధిలో చెప్తున్నారు. సినిమాల్లో కూడా ఈమె సందడి మామూలుగా లేదు. ముందు ముందు కొరియోగ్రాఫర్ గా ఝాన్సీ సత్తా చాటే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి లక్ అంటే నిజంగా ఝాన్సీదే అంటూ చాలా మంది కళాకారులు కామెంట్స్ చేస్తున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి