Jabardasth Nookaraju : కిరాక్ ఆర్పీ పరువుతీసేశారు.. నూకరాజు, పంచ్ ప్రసాద్ సెటైరికల్ స్కిట్ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Jabardasth Nookaraju : కిరాక్ ఆర్పీ పరువుతీసేశారు.. నూకరాజు, పంచ్ ప్రసాద్ సెటైరికల్ స్కిట్

Jabardasth Nookaraju : కిరాక్ ఆర్పీ ఈ మధ్య ఎంతలా హైలెట్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మల్లెమాల, శ్యాంప్రసాద్ రెడ్డి, జబర్దస్త్ షోలను ఏకిపారేశాడు. అక్కడ అందరినీ నీచంగా చూస్తారని, ఫుడ్ కూడా సరిగ్గా పెట్టరని ఇలా నానా రకాలుగా ఆరోపణలు చేశాడు. ఆర్పీ ఆరోపణల్లో ఎక్కువగా హైలెట్ అయింది మాత్రం ఫుడ్ గురించే. అక్కడ అన్నం ఎలా ఉంటుంది.. ఎలాంటి ఫుడ్ పెడతారు.. సాంబార్ ఎలా ఉంటుందో.. ఇలా వివరంగా చెప్పుకొచ్చాడు. దీంతో […]

 Authored By aruna | The Telugu News | Updated on :1 August 2022,8:40 pm

Jabardasth Nookaraju : కిరాక్ ఆర్పీ ఈ మధ్య ఎంతలా హైలెట్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మల్లెమాల, శ్యాంప్రసాద్ రెడ్డి, జబర్దస్త్ షోలను ఏకిపారేశాడు. అక్కడ అందరినీ నీచంగా చూస్తారని, ఫుడ్ కూడా సరిగ్గా పెట్టరని ఇలా నానా రకాలుగా ఆరోపణలు చేశాడు. ఆర్పీ ఆరోపణల్లో ఎక్కువగా హైలెట్ అయింది మాత్రం ఫుడ్ గురించే. అక్కడ అన్నం ఎలా ఉంటుంది.. ఎలాంటి ఫుడ్ పెడతారు.. సాంబార్ ఎలా ఉంటుందో.. ఇలా వివరంగా చెప్పుకొచ్చాడు. దీంతో ప్రొడక్షన్ ఫుడ్ మీద ఎక్కువ చర్చ జరిగింది. అంతే కాకుండా ఆర్పీ మాటలను సపోర్ట్ చేస్తూ కొంతమంది, వ్యతిరేకిస్తూ ఇంకొంత మంది మీడియా ముందుకు వచ్చారు. అందులో ఆది, రాం ప్రసాద్, షేకింగ్ శేషు వంటి వారు ఆర్పీ చెప్పింది అబద్దమని అన్నారు.

ఆర్పీ కరెక్ట్‌గా చెప్పాడు.. ఫుడ్ చాలా దరిద్రంగా ఉంటుందని రాకేష్ మాస్టర్ చెప్పుకొచ్చాడు. ఇక ఆది, రాం ప్రసాద్ ఇద్దరూ ఇలా మీడియా ముందుకు వచ్చి ఆర్పీ చెప్పిన మాటలన్నీ అబద్దాలు అని అనడంతో ఇంకాస్త కాంట్రవర్సీ పెరిగింది. అలా ఆర్పీ వర్సెస్ మల్లెమాల, జబర్దస్త్ అన్నట్టుగా జరిగింది. ఇక ఇప్పుడు జాతి రత్నాలు షోలో దీన్నే ఓ స్పూప్‌గా చేసినట్టు కనిపిస్తోంది. ఇందులో పంచ్ ప్రసాద్, నూకరాజు, ఇమాన్యుయేల్, శ్రీముఖి పాల్గొన్నారు. అదొక చర్చా వేదిక, డిబెట్ అన్నట్టుగా అరేంజ్ చేశారు. మీ ప్రొడక్షన్ కంపెనీలో ఫుడ్ బాగా లేదు అని అంటుంటారు.. దీనిపై మీ రియాక్షన్ ఏంటి? అన్నట్టుగా అడుగుతారు.

Punch Prasad Nooka Raju Satires in Nookraju in Jathi Ratnalu Promo

Punch Prasad Nooka Raju Satires in Nookraju in Jathi Ratnalu Promo

అయితే ప్రోమోలో ఏదో కట్ చేసినట్టు కనిపిస్తోంది. డైలాగ్స్‌ను వినిపించకుండా చూపించారు. మరి ప్రోమోలో అయితే ఏదో కౌంటర్లు వేసినట్టు కనిపిస్తోంది. ఆర్పీ మీద ఎలాంటి కౌంటర్లు వేశారు? అన్నది ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. మల్లెమాల మాత్రం ఆర్పీ మాటలను కాస్త సీరియస్‌గా తీసుకున్నట్టు అనిపిస్తుంది. అందుకే ఆర్పీ మాటలకు కౌంటర్లు ఇప్పించిందని, ఇలా తమ ప్రోగ్రాంలలో స్కిట్ల ద్వారా కౌంటర్లు వేయిస్తోందని అర్థమవుతోంది. మరి ఆర్పీ ఈ స్కిట్ చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది