Puri Jagannadh – Charmme Kaur : లైగర్ ఫ్లాప్ తర్వాత చాలా రోజులకి పూరీతో కనిపించిన చార్మి వైరల్ వీడియో..!!

Authored By Breaking News | The Telugu News | Updated on: March 6, 2023, 11:00 pm

Puri Jagannadh – Charmme Kaur : డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కెరియర్ ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్న సంగతి తెలిసిందే. వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. అంతకు ముందు ఇదే పరిస్థితి ఉంది. ఆ సమయంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో లైగర్ అనే సినిమా చేయడం తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ నష్టాలను మిగిల్చింది. ఈ సినిమాతో పూరి జగన్నాథ్ చాలా నష్టపోయాడు. అయితే గత కొంత కాలం నుండి

Puri Jagannadh And Charmme Kaur Spotted Airport

Puri Jagannadh And Charmme Kaur Spotted Airport

పూరీతో సీనియర్ హీరోయిన్ ఛార్మి ట్రావెల్ చేస్తున్న సంగతి తెలిసిందే. పూరి నిర్మించే సినిమాలకు సహనిర్మాతగా వ్యవహరిస్తూ… రాణిస్తూ ఉంది. “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాల సమయంలో కీలకంగా వ్యవహరించింది. అయితే సినిమా అనుకున్నంత రీతిలో విజయం సాధించకపోవడంతో చార్మి చాలా బాధపడటం జరిగింది. వరుసపరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండ కి లైగర్ కోలుకోలేని దెబ్బ వేసింది. లైగర్ సినిమా చేస్తున్న సమయంలో ఇంకా ప్రమోషన్ కార్యక్రమాలలో డైరెక్టర్ పూరీ పక్కనే ఎక్కువగా చార్మి కనిపిస్తూ ఉంది.

Puri Jagannadh And Charmme Kaur Spotted Airport

Puri Jagannadh And Charmme Kaur Spotted Airport

అయితే సినిమా ఫ్లాప్ అయ్యాక ఛార్మి జాడ ఎవరికీ తెలియలేదు. లైగర్ పరాజయం పాలైన తర్వాత కనిపించిన సందర్భాలలో డైరెక్టర్ పూరి ఒక్కరే ఉన్నారు. ఈ క్రమంలో చార్మితో పూరికి చెడినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇదంతా పక్కన పెడితే లేటెస్ట్ గా లైగర్ పరాజయం పాలైన తరువాత.. చాలా నెలలకు డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో చార్మి కనిపించింది. ముంబై విమానాశ్రయంలో వీళ్ళిద్దరూ కనిపించడం జరిగింది. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లు పలు ఫోటోలు తీస్తూ వీడియో కూడా చిత్రీకరించడంతో… లేటెస్ట్ పూరి ఛార్మి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp