Puri jagannadh – Charmi Kaur : ఆ సినిమా రిజ‌ల్ట్ తోనైనా అర్థం అవుతుందా.. ఇప్ప‌టికైనా చార్మీని వ‌దిలేస్తాడా..?

Authored By mallesh | The Telugu News | Published on: August 27, 2022, 10:20 pm

Puri jagannadh – Charmi Kaur : డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తీసిన లెటెస్ట్ మూవీ లైగ‌ర్ డిజాస్ట‌ర్ గా మిగిలింది. ఎన్నో అంచ‌నాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ ఊహించ‌ని రీతిలో షాక్ ఇచ్చింది. ఇందులో విజ‌య్ న‌ట‌న త‌ప్పితే మ‌రేమి లేద‌ని ప్రేక్ష‌కులు చెప్పేస్తున్నారు. అయితే ఇలాంటి ఫ‌లితం రావ‌డానికి కార‌ణం చార్మీనే అనే కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్లు. ఇప్పటికైనా పూరీ గ్రహిస్తాడా..? అంటూ బాగా ట్రోల్ చేస్తున్నారు. అసలు పూరి పక్కన ఛార్మి అనవ‌స‌రం అని కూడా అంటున్నారు. జోతిలక్ష్మి సినిమాతో పూరి చార్మీ కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ స్థాపించి ఇద్దరు నిర్మాతలుగా సినిమాలు నిర్మిస్తున్నారు. అయితే వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఆశించినత సక్సెస్ సాధించడం లేదు. ఒక్క ఇస్మార్ట్ శంకర్ తప్ప మిగతా సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్‌గా నిలిచాయి. ఇస్మార్ట్ శంక‌ర్‌కు ముందే తీవ్ర అప్పుల్లో కూరుకుపోగా ఈ సినిమా గ‌ట్టెక్కించి ఆదుకుంది.

దీంతో అప్పులు తీర్చేసుకుని భారీ లాభాల్లోకి వ‌చ్చేశారు. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమా సక్సెస్‌తో పూరి లైగర్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా పూరి కెరీర్‌లో ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా. విజయ్ దేవరకొండ కెరీర్‌లో కూడా ఇది ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. అందుకే అందరికంటే ఎక్కువ హడావుడి చేసింది ఛార్మి. విజయ్ దేవరకొండను నా బంగారు కొండ అని చెప్పుకొచ్చింది. ఇలాంటి హీరో ఇండస్ట్రీలో ఇంకొకడు లేడు అని పూరి జగన్నాథ్ కూడా పొగిడేశాడు. ఇదంతా చూసి లైగర్ టీం మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు ఉంది అని కూడా మాట్లాడుకున్నారు. ఇదంతా పక్కన పెడితే, విజయ్ ప్రమోషన్స్ లో మాట్లాడింది చూసే సినిమా ఫ్లాప్ అని డిసైడయ్యారు. ఇక చార్మీ చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాద‌నే చెప్పాలి. తీరా సినిమా డిజాస్టర్ అవ‌గానే నెటిజ‌న్లు ఆడేసుకుంటున్నారు.

Puri jagannadh Charmi Kaur personal story

Puri jagannadh Charmi Kaur personal story

Puri jaganath- charmy: చార్మీతో పూరీకి వ‌చ్చిందేమిటీ…?

అసలు ఛార్మీ వల్ల పూరికి జ‌రుగుతున్న మేలు ఏంట‌ని.. కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకరికొకరు గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదని అంటున్నారు. ఇంత‌టితో ఆగ‌కుండా పూరి చార్మీని వదిలేస్తే గానీ సక్సెస్‌లు రావని అంటున్నారు. మ‌రి పూరీ ఆ నిర్ణ‌యం తీసుకుంటారో లేదో తెలియ‌దు కానీ.. ఇక ఇప్పుడు జనగణమన సినిమా కూడా తెరకెక్కుతోంది. దీని ప్రభావం గట్టిగానే ఉండేలా ఉంది. పూరి, సినిమాలు ఇప్పుడు టీజర్‌కి ఎక్కువ ట్రైలర్‌కి తక్కువ అని డిసైడ్ అవుతున్నారు. రికార్డులు బ్రేక్ చేసే సినిమాలు తీసిన పూరి ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీస్తున్నారు.. అని ప్ర‌శ్నిస్తున్నారు.. మొత్తానికి చార్మీని ఎప్పుడు వ‌దిలించుకుంటాడో ఏమో.. అంటున్నారు నెటిజ‌న్లు,

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp