Puri Jagannadh : ప్రాణహాని ఉంది.. ముదురుతున్న లైగర్ వివాదం.. పోలీస్ ఫిర్యాదులో షాకింగ్ లైన్స్..!

Authored By Rame Samhith | The Telugu News | Published on: October 27, 2022, 3:40 pm

Puri Jagannadh : పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా లైగర్. ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేయగా తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ చేసింది. పూరీ, విజయ్ క్రేజీ కాంబో అనిపించడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కోసం భారీగా వెచ్చించారు. సినిమా భారీ నష్టాలను తీసుకు రావడంతో డిస్ట్రిబ్యూటర్లు తమ నష్టాలను భరించాలని దర్శక నిర్మాత పూరీ మీద ఒత్తిడి తెస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు కొంత డబ్బు అడ్జెస్ట్ చేసేందుకు ఓకే చెప్పిన పూరీ కొంత సమయం కావాలని అన్నారు.

అయినా సరే తమకు ఇవ్వాల్సిన ఎమౌంట్ వెంటనే సెటిల్ చేయాలని పూరీ మీద ఒత్తిడి తెస్తున్నారు. పూరీ ఆఫీస్ దగ్గర ధర్నాకి దిగాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ విషయంపై పూరీ కూడా సీరియస్ గా ఉన్నారు. సినిమా ఫ్లాప్ అయినా డిస్ట్రిబ్యూటర్లకు తాను ఇవ్వల్సిన అవసరం లేదని కానీ తను మంచి వాడిని కాబట్టి కొంత డబ్బు భరిస్తానని అన్నానని.. అయినా కూడా గొడవ చేసి తన పరువు తీయాలని చూస్తే మాత్రం తాను అసలు ఊరుకునేది లేదని పూరీ అన్నారు.

Puri Jagannadh file case on warangal srinu and financier srinu

Puri Jagannadh file case on warangal srinu and financier srinu

అంతేకాదు పూరీ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్షియర్ శ్రీధర్ ల పై పోలీసులకు ఫిరూఅదు చేశారు. వారిద్దరు తన మీద తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని. తమ ఫ్యామిలీ ని కూడా వారు డిస్ట్రబ్ చేస్తున్నారని ఫిర్యాధులో పేర్కొన్నారు. అంతేకాదు వారి వల్ల తనకు ప్రాణహాని కూడా ఉందని పూరీ తన ఫిర్యాధులో రాయడం షాకింగ్ గా ఉంది. లైగర్ గొడవ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ న్యూస్ గా మారింది. ఇండస్ట్రీకి ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చిన పూరీ ఇలాంటి పరిస్థితి ఫేజ్ చేయాల్సి వస్తుందని ఊహించి ఉండరు. తన ఫ్యామిలీకి తనకు లైగర్ డిస్ట్రిబ్యూటర్ల వల్ల హాని ఉందని చెప్పి షాక్ ఇచ్చారు పూరీ జగన్నాథ్. మరి ఈ గొడవ ఎక్కడిదాకా వెళ్తుంది.. ఎలా పరిష్కారం అవుతుంది అన్నది చూడాలి.

Rame Samhith

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp