UPI వాడేవారికి షాక్..! ఇక Google Pay, PhonePe ఫ్రీ కాదు..?
ప్రధానాంశాలు:
UPI వాడేవారికి షాక్..! ఇక Google Pay, PhonePe ఫ్రీ కాదు..?
UPI : భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల Digital Payments విప్లవానికి ప్రధాన కారణమైన యూపీఐ UPI – Unified Payments Interface మరోసారి వార్తల్లో నిలిచింది. Google Pay, PhonePe, Paytm, BHIM UPI వంటి యాప్స్ ద్వారా ప్రతిరోజూ కోట్లాది మంది లావాదేవీలు చేస్తున్నారు. చిన్న టీ స్టాల్ నుంచి భారీ షాపింగ్ మాల్స్ వరకు UPI చెల్లింపులు ఇప్పుడు సాధారణమైపోయాయి. అయితే తాజాగా UPI MDR Charges గురించి వస్తున్న వార్తలు యూజర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇకపై యూపీఐ ద్వారా చేసే ప్రతి చెల్లింపుపైనా ఛార్జీలు పడతాయా? లేక కొంతమందికే వర్తిస్తాయా? అసలు కేంద్ర ప్రభుత్వం Central Government రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI పరిశీలిస్తున్న ప్రతిపాదన ఏమిటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
UPI వాడేవారికి షాక్..! ఇక Google Pay, PhonePe ఫ్రీ కాదు..?
UPI MDR Charges అంటే ఏమిటి..?
మర్చంట్ డిస్కౌంట్ రేట్ Merchant Discount Rate – MDR అనేది డిజిటల్ పేమెంట్ ద్వారా వ్యాపారులు Merchants చెల్లించే ఒక సేవా రుసుము. సాధారణంగా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు చెల్లింపులపై ఈ ఫీజు అమల్లో ఉంటుంది. అయితే 2020 జనవరి నుంచి UPI Payments మరియు RuPay Debit Card లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం Zero MDR విధానాన్ని అమలు చేసింది. దీంతో వినియోగదారులు (Users) మాత్రమే కాదు, వ్యాపారులు కూడా అదనపు ఛార్జీలు లేకుండా UPI సేవలను వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఈ విధానంలో కొంత మార్పు తీసుకురావాలనే అంశంపై ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
UPI ఎవరికీ ఛార్జీలు పడే అవకాశం ఉంది?
ప్రస్తుతం సోషల్ మీడియాలో “ఇకపై Google Pay, PhonePe వాడితే ప్రతి ట్రాన్సాక్షన్‌కు డబ్బులు కట్టాలి” అనే ప్రచారం జరుగుతోంది. అయితే అందులో పూర్తి నిజం లేదని తెలుస్తోంది. సాధారణ UPI వినియోగదారులకు (UPI Users) ఎలాంటి కొత్త ఛార్జీలు ఉండకపోవచ్చు. వార్షిక టర్నోవర్ రూ.40 లక్షలకు పైబడిన పెద్ద వ్యాపారులు Large Merchants ఈ-కామర్స్ సంస్థలకే MDR Charges వర్తించే అవకాశం ఉంది. చిన్న వ్యాపారులు, వ్యక్తిగతంగా UPI ఉపయోగించే వినియోగదారులపై ప్రస్తుతం ఎలాంటి ఫీజు విధించే ప్రతిపాదన లేదని తెలుస్తోంది. అంటే టీ షాపులు, చిన్న దుకాణాలు, వ్యక్తిగతంగా Google Pay లేదా PhonePe ద్వారా డబ్బులు పంపే వారికి తక్షణ ప్రభావం ఉండకపోవచ్చు.
Google Pay, PhonePe, Paytm యూజర్లకు భయపడాల్సిన అవసరముందా?
ప్రస్తుతం Google Pay, PhonePe, Paytm, BHIM UPI ద్వారా పేమెంట్లు చేసే కోట్లాది మంది యూజర్లకు ఎలాంటి అధికారిక మార్పులు ప్రకటించలేదు. వ్యక్తిగత UPI ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు విధిస్తున్నట్లు ప్రకటించలేదు. సాధారణ వినియోగదారుల నుంచి MDR వసూలు చేయాలని కూడా అధికారికంగా చెప్పలేదు. అందువల్ల ప్రస్తుతం వినియోగదారులు మునుపటిలాగే UPI సేవలను ఉచితంగానే వినియోగించే అవకాశం ఉంది. MDR ఎందుకు తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది? దేశంలో ప్రతి నెలా లక్షల కోట్ల రూపాయల విలువైన UPI లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే Zero MDR Policy కారణంగా UPI సేవలు అందిస్తున్న సంస్థలకు నేరుగా ఆదాయం రావడం లేదు. ప్రస్తుతం ఈ వ్యవస్థ నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు Incentives ఇస్తోంది. కానీ. నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయి. డిజిటల్ మౌలిక సదుపాయాల నిర్వహణకు భారీ వ్యయం అవుతోంది. చెల్లింపు సేవల సంస్థలు Payment Service Providers ఆదాయ మార్గాల కోసం ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద వ్యాపారుల నుంచి మాత్రమే స్వల్ప MDR Charges వసూలు చేసే ప్రతిపాదనపై చర్చలు కొనసాగుతున్నాయి.
UPI ఎంత ఛార్జీ విధించే అవకాశం ఉంది?
ప్రస్తుతం మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం. వార్షిక టర్నోవర్ రూ.40 లక్షలకు పైబడిన వ్యాపారులపై 5 నుంచి 7 Basis Points వరకు MDR విధించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని ప్రకారం కొన్ని పెద్ద విలువైన ట్రాన్సాక్షన్లపై సుమారు రూ.5 నుంచి రూ.7 వరకు Merchant Fee ఉండే అవకాశం ఉందని రిపోర్టులు సూచిస్తున్నాయి. అయితే ఇది ఇంకా తుది నిర్ణయం కాదు. ప్రస్తుతం అధికారిక నిర్ణయం వచ్చిందా? ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం లేదా Reserve Bank of India (RBI) నుంచి UPIపై కొత్త ఛార్జీలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ప్రతి UPI వినియోగదారుడు ఇకపై ఛార్జీలు చెల్లించాలనే వార్తలు సరైనవి కావు. ప్రస్తుతం ఇది కేవలం ప్రతిపాదన దశలోనే ఉంది. తుది నిర్ణయం వచ్చిన తర్వాతే అమలులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి సమాచారాన్ని నమ్మకుండా అధికారిక ప్రకటన కోసం వేచి ఉండడం మంచిది.
UPI MDR Charges గురించి ప్రస్తుతం వస్తున్న వార్తలు ప్రధానంగా పెద్ద వ్యాపారులు Large Merchants)ఈ-కామర్స్ సంస్థలు చెల్లించే మర్చంట్ ఫీజుకు సంబంధించినవే. సాధారణంగా Google Pay, PhonePe, Paytm ద్వారా డబ్బులు పంపే వ్యక్తిగత వినియోగదారులకు ప్రస్తుతం ఎలాంటి అదనపు ఛార్జీలు విధిస్తున్నట్లు అధికారిక నిర్ణయం లేదు. అందువల్ల “ఇకపై UPI పూర్తిగా ఫ్రీ కాదు” అనే ప్రచారాన్ని పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం ప్రకటించిన తర్వాతే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.







