
#image_title
Intinti Gruhalakshmi Kasthuri ; లేడి సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కమర్షియల్ సినిమాలే కాక లేడి ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేసి మంచి పేరు తెచ్చుకుంది నయనతార. ఇప్పుడు ఆమె క్రేజ్ స్టార్ హీరోలని కూడా మించింది. అయితే ఆమె 2022 జూన్‌లో వివాహం చేసుకుంది. నయన్-విఘ్నేశ్ దంపతులు పెళ్లైన నాలుగు నెలలకే కవల పిల్లలకు తల్లిదండ్రులైనట్లు ప్రకటించారు. సరోగసి ద్వారా బిడ్డల్ని కన్నట్లు వెల్లడించడంతో దీనిపై అప్పట్లో ఆమె తీవ్ర దుమారం రేగింది.ఆ తర్వాత క్లీన్ చీట్ వచ్చింది. ప్రస్తుతం ఈ జంట తమ పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నారు. అయితే నయనతారపై వీలు చిక్కినప్పుడల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది గృహలక్ష్మీ నటి కస్తూరి. ఈమె విషయానికి వస్తే పలు సీరియల్స్‌లో నటించి సందడి చేసిన ఈమె సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఐదు పదుల వయసులో కూడా నటి కస్తూరి ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో రీల్స్, ఫొటోస్ షేర్ చేస్తూ నానా రచ్చ చేస్తుంది.ఆమె కాంట్రవర్సీస్‌తో కూడా ఎక్కువ వార్తలలో నిలుస్తూ ఉంటుంది. మీటూ ఉద్యమం ఫెయిల్ అయిన ఉద్యమం అని కస్తూరి అన్నారు. గతంలో కస్తూరి.. నయనతార సరోగసి విధానం ద్వారా పిల్లలని పొందినప్పుడు ఆమె ఖండించారు. ప్రతి ఒక్కరూ సరోగసి విధానానికి వెళితే సమాజం ఎటుపోతుంది, సరోగసి విధానాన్ని బ్యాన్ చేయాలని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసింది కస్తూరి. అయితే ఆ వ్యాఖ్యలపై తాజాగా మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేసింది కస్తూరి.నయనతార సరోగసి విధానాన్ని తాను వ్యతిరేకించలేదని ఆమె లీగల్‌గా పిల్లలని దక్కించుకొని ఉంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది.
ఆ ప్రాసెస్ నాకు నచ్చకే ప్రశ్నించానని అంటుంది కస్తూరి. అయితే నయనతారకి ఆప్షన్ లేక సరోగసి ఎంచుకొని ఉంటుందని యాంకర్ ప్రశ్నించగా, దానికి కస్తూరి.. అవకాశం లేక కాదులేండి, అందులో ఏదో తేడా ఉంది. అయినా అవన్నీ ఇప్పుడు ఎందుకులెండి అని కామ్ అయిపోయింది. అప్పట్లో నయనతారని సూపర్ స్టార్ కూడా కాదని చెప్పింది కస్తూరి. ప్రస్తుతం ఉన్న నటీమణుల్లో సూపర్ స్టార్‌గా చెప్పుకోదగ్గవారు ఎవరూ లేరని బదులిచ్చింది. అయితే, అలనాటి నటీమణులు కేపీ సుందరాంబల్ , విజయశాంతి పేర్లను చెప్పుకొచ్చింది. నయన్‌కు తానో అభిమానిని అంటూనే.. ఆమెను లేడీ సూపర్ స్టార్ అనలేమంటూ ఆమె చెప్పడం విశేషం.
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.