Bandla Ganesh : బండ్ల గ‌ణేష్ శాపం వ‌ల్ల‌నే పూరీ జ‌గ‌న్నాథ్ సినిమా ఇంత‌లా ఫ్లాప్ అయిందా?

Authored By Sam C | The Telugu News | Published on: August 25, 2022, 9:00 pm

Bandla Ganesh : డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ సినిమాల గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న అప్ప‌ట్లో వ‌రుస హిట్స్ అందించి స్టార్ డైరెక్ట‌ర్‌గా ఎదిగాడు. రీసెంట్‌గా ఆయ‌న విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కిన లైగర్ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుందనే సంగతి తెలిసిందే. కారణాలేవైనా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని విజయ్ దేవరకొండ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తాడని అందరూ భావిస్తే అందుకు భిన్నంగా జరిగింది.అయితే లైగర్ ఫ్లాప్ వెనుక ఒక హీరో అభిమానులు ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Bandla Ganesh : బండ్ల‌న్న ఉసురా?

మ‌రోవైపు బండ్ల గ‌ణేష్ కూడా శాపం త‌గిలిందంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. పూరి జగన్నాధ్ కి బండ్ల గణేష్ ఉసురు బాగా తగిలింది అంటూ ట్రోల్ చేస్తున్నారు. పూరి తనయుడు ఆకాష్ పూరి నటించిన చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ పూరి జగన్నాధ్ పై డైరెక్ట్ గా అటాక్ చేశాడు. సొంత కొడుకుని పట్టించుకోకుండా ఎవరెవరినో సూపర్ స్టార్స్ చేస్తావు ఏంటి అన్నా అంటూ బండ్ల గణేష్ పూరిని విమర్శించిన సంగతి తెలిసిందే. లైగర్ టాక్ తేడా కొట్టడంతో ఆ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Puri Jagannath movie liger flop with Bandla Ganesh

Puri Jagannath movie liger flop with Bandla Ganesh

బండ్లన్న ఉసురు, వదిన ఉసురు, పూరి కొడుకు ఉసురు బాగా తగిలింది. అందుకే లైగర్ చిత్రం డిజాస్టర్ అవుతోంది. పూరి కూడా నెమ్మదిగా ఆర్జీవీలాగా మారిపోతున్నాడు. పూరిని ఇలా చూస్తుంటే బాధగా ఉంది అంటూ నెటిజన్లు చేస్తున్న విమర్శలు వైరల్ అవుతున్నాయి. లైగర్ సినిమా ఫ్లాప్ కావడానికి ఆ స్టార్ హీరో ఫ్యాన్స్, బండ్ల గ‌ణేష్ కారణం కాకపోయినా ఈ సినిమా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ కావడం వెనుక మాత్రం ఆ స్టార్ హీరో అభిమానులు ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు లైగర్ సినిమా పుంజుకునే అవకాశాలు దాదాపుగా లేవని చెప్పవచ్చు. మొత్తానికి లైగ‌ర్ చిత్రం పూరీకి పెద్ద ఎఫెక్ట్ ప‌డింద‌ని అంటున్నారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp